ఫిబ్రవరి 19న బల్దియా హెడ్డాఫీసులో ప్రజావాణి రద్దు

ఫిబ్రవరి 19న బల్దియా హెడ్డాఫీసులో ప్రజావాణి రద్దు

హైదరాబాద్, వెలుగు: ఈ నెల 19న జీహెచ్ఎంసీ కౌన్సిల్ సమావేశం జరగనుంది. ఉదయం 10 గంటలకు హెడ్డాఫీసులో  కౌన్సిల్ మీటింగ్ నిర్వహిస్తుండగా... సోమవారం ప్రజావాణి రద్దు చేసినట్లు కమిషనర్ రోనాల్డ్ రోస్ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు.  

ప్రజావాణి తో పాటు  ఫోన్ ఇన్ ప్రోగ్రాం కూడా ఉండదని ప్రకటించారు.  హెడ్డాఫీసులో  మాత్రమే రద్దు ప్రజావాణి చేశామని, సర్కిల్ ఆఫీసుల్లో ఆ రోజు యధావిధిగా ఉంటుందని పేర్కొన్నారు.