అత్యాచారం కేసులో ప్రజ్వల్ రేవణ్ణకు 6 రోజుల సిట్ కస్టడీ

అత్యాచారం కేసులో ప్రజ్వల్ రేవణ్ణకు 6 రోజుల సిట్ కస్టడీ

బెంగళూరు: అత్యాచారం కేసులో ప్రజ్వల్ రేవణ్ణను ఆరు రోజుల సిట్ కస్టడీకి అనుమతిచ్చింది బెంగళూరు హైకోర్టు. రేపటి నుంచి జూన్ 6 వరకు 6 రోజుల పాటు ప్రజ్వల్ రేవణ్ణ ను విచారించనుంది సిట్ బృందం. రేవణ్ణ ఫోన్ మిస్సింగ్ పై ఆరా తీయనున్నారు. 

సస్పెండెడ్ జనతాదళ్ ఎస్ నేత ప్రజ్వల్ రేవణ్ణను శుక్రవారం (మే31)  ఏడు రోజుల  సిట్ కస్టడీకి పంపారు. శుక్రవారం తెల్లవారు జామున జర్మనీ నుంచి బెంగుళూరు విమానాశ్రయానికి చేరుకున్ను కొద్దిసేపటికే ప్రజ్వల్ రేవణ్ణను అరెస్ట్ చేశారు. వైద్య పరీక్షల అనంతరం కోర్టు హాజరు పర్చారు. 

పలువురు మహిళలపై లైంగిక వేధింపులకు పాల్పడి వీడియోలు చిత్రీకరించినట్లు ప్రజ్వల్ రేవణ్ణ ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. శుక్రవారం బెంగళూరు ఎయిర్ పోర్టులో దిగగానే ఐదుగురు సభ్యుల మహిళా స్వ్కాడ్ అతన్ని అరెస్ట్ చేసింది. అనంతరం సిట్ ప్రధాన కార్యాలయానికి తరలించారు.  అయితే సిట్ తో పాటు మహిళా పోలీసు అధికారుల బృందం కూడా ప్రజ్వల్ ను విచారించనున్నట్లు తెలుస్తోంది.