ప్రకాశం బ్యారేజీ వరద.. సముద్రంలోకి నీళ్లు విడుదల

ప్రకాశం బ్యారేజీ వరద.. సముద్రంలోకి నీళ్లు విడుదల

కృష్ణా నదికి వరద ప్రవాహం భారీగా వస్తుంది. గడిచిన కొన్ని రోజులుగా కృష్ణానది పరివాహక ప్రాంతాల్లో భారీగా వర్షాలు కురుస్తుండంతో నదిలోనికి పెద్ద ఎత్తున వరద నీరు వస్తుంది. ఎన్టీఆర్ జిల్లా వ్యాప్తంగా కురిసిన వర్షాలకు జిల్లాలోని వాగులు, వంకలు పొంగిపొర్లుతుండటంతో ఈ వరద నీరంత ప్రస్తుతం కృష్ణా నదిలోకి వచ్చి చేరడంతో నీటి ప్రవాహం గంట, గంటకు పెరుగుతుంది.

 ప్రస్తుతం ప్రకాశం బ్యారేజీ దగ్గర 30 వేల క్యూసెక్కుల నీటి ప్రవాహం కొనసాగుతుంది. నీటి ప్రవాహం పెరుగుతుండటంతో బ్యారేజీ దగ్గర 12 అడుగుల నీటి మట్టాన్ని ఉంచుతూ.. బ్యారేజీ 72 గేట్లలోని 40 గేట్లను ఒక అడుగు మేర ఎత్తి, మిగులు జలాలను కిందికి రిలీజ్ చేస్తున్నారు. ఇవాళ ( డిసెంబర్​ 7)  ఉదయం 7 గంటలకు  ప్రకాశం బ్యారేజీ దగ్గర ఇన్ ఫ్లో 30 వేల క్యూసెక్కులు ఉండగా, అవుట్ ఫ్లో లో కూడా 30 వేల క్యూసెక్కులుగా కొనసాగుతుంది. వరద నీటిని దిగువకు విడుదల చేసిన నేపథ్యంలో నదీ పరివాహక ప్రాంతంలోని ప్రజలను అధికారులు అలర్ట్ చేస్తున్నారు.