
మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (MAA) ఎన్నికల్లో పోటీ చేసే తన కార్యవర్గాన్ని ప్రముఖ నటుడు ప్రకాష్ రాజ్ ప్రకటించారు. ఇప్పటివరకూ ఎన్నికల్లో అధ్యక్ష పదవికి పోటీ చేస్తారని భావించిన నటీమణులు హేమ, జీవితా రాజశేఖర్ ప్రకాశ్‌రాజ్ ప్యానెల్ నుంచి బరిలో నిలిచారు. ఈ విషయాన్ని ప్రకాశ్‌రాజ్ స్వయంగా తెలిపారు.
ప్రకాశ్ రాజ్ MAA అధ్యక్ష పదవికి పోటీపడుతున్నారు. ఆయన ప్యానెల్‌లో ఉపాధ్యక్షులుగా బెనర్జీ, హేమ పోటీ చేయనున్నట్లు తెలిపారు. జనరల్ సెక్రటరీగా జీవితా రాజశేఖర్, ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ గా శ్రీకాంత్, ట్రెజరర్ గా నాగినీడు, సంయుక్త కార్యదర్శులుగా అనితా చౌదరి, ఉత్తేజ్ పోటీ చేయనున్నట్టు తెలిపారు.
సీనియర్ నటి జయసుధ అమెరికా వెళ్లడంతో ఆమెకు ప్యానెల్లో స్థానం కల్పించలేదని ప్రకాష్ రాజ్ తెలిపారు. అయితే ప్యానెల్‌కు తన మద్దతు ఉంటుందని జయసుధ హామీ ఇచ్చారని చెప్పారు. ప్రకాష్ రాజ్ ప్యానెల్లో ఇంకా ప్రగతి,అనసూయ, అజయ్, సుబ్బరాజు, సమీర్, ఖయ్యూం, బ్రహ్మాజీ, కౌశిక్, ప్రభాకర్,భూపాల్, శివారెడ్డి, రమణారెడ్డి, సుడిగాలి సుధీర్, సురేష్ కొండేటి, తనీష్, టార్జాన్ సభ్యులుగా ఉన్నారు.