మోడీపై ప్రకాష్ రాజ్ సెటైర్లు

మోడీపై  ప్రకాష్ రాజ్ సెటైర్లు

ప్రధాని నరేంద్ర మోడీపై నటుడు ప్రకాష్ రాజ్ సెటైర్లు వేశారు. శనివారం ప్రధాని పుట్టినరోజ సందర్భంగా నమీబియా నుంచి ప్రత్యేక విమానంలో తీసుకొచ్చిన 8 చీతాలను మధ్యప్రదేశ్ లోని  కూనో నేషనల్  పార్కులో విడిచిపెట్టారు. స్వయంగా మోడీనే వాటిని పార్కులోకి విడిచిపెట్టారు. అయితే దీనిపైన  ప్రకాష్ రాజ్ స్పందిస్తూ అంతరించిపోయిన చీతాలను వీదేశాల నుండి తీసుకువచ్చి అడవుల్లోకి వదిలారు. మరి బ్యాంకులను మోసం చేసి పారిపోయిన ఈ చీతాలను ఎప్పుడు తీసుకొస్తారు. జస్ట్ అడుగుతున్నా అంటూ ప్రకాష్ రాజ్ ట్వీట్ చేశారు. తాను చెప్పే చీతాలు ఇవ్వేనంటూ విజయ్ మాల్వా, నీరవ్ మోడీ, మెహుల్ ఛోక్సీల ఫొటోలను ప్రకాష్ రాజ్ తన ట్వీట్ కు షేర్ చేశారు. ప్రకాష్ రాజ్ చేసిన ఈ ట్వీట్ వైరల్ గా మారింది. 

నమీబియా నుంచి వచ్చిన 8 చీతాలు  ప్రత్యేకంగా తయారు చేసిన క్వారంటైన్ ఎన్‌క్లోజర్స్‌లో కొద్దిరోజుల పాటు ఉండనున్నాయి. రెండు మగ చీతాలను ఒక ఎన్‌క్లోజర్‌లో.. ఆడ చీతాని పక్కనే మరో ఎన్‌క్లోజర్‌లో గడపనున్నాయి. 8 చీతాలకు వ్యాక్సిన్‌లు వేశారు. వాటికి సాటిలైట్ కాలర్‌లు కూడా అమర్చారు. ఇండియాలో చీతాల గాండ్రింపులు మరోసారి వినపడాలన్న లక్ష్యంతో... కేంద్రం ఇంటర్‌ కాంటినెంటల్ ట్రాన్స్‌లొకేషన్ ప్రాజెక్టును చేపట్టింది. 

నమీబియా నుంచి వచ్చిన 8 చీతాలను కునో పల్‌పూర్ నేషనల్ పార్క్లోనే విడిచిపెట్టడానికి కారణం లేకపోలేదు. పార్కులో చీతాలకు అనుకూల వాతావరణం ఉంటుంది. ఇక్కడి సగటు ఉష్ణోగ్రతలు 42.3 డిగ్రీ సెల్సియస్గా నమోదవుతాయి. చలికాలంలో 6 నుంచి 7డిగ్రీల ఉష్ణోగ్రతలు రికార్డవుతాయి. ప్రస్తుతం పార్క్‌లో 21 చీతాలు ఉన్నాయి. తాజాగా 8  చీతాలను తీసుకొచ్చిన నేపథ్యంలో..పార్కులో 36 చీతాలు  ఉండేందుకు అన్ని వసతులు కల్పించారు. పార్కు మొత్తం 748 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉంది. కొత్తగా వచ్చిన చీతాల సంరక్షణ కోసం ప్రత్యేకంగా రెండు అదనపు పెట్రోలింగ్ వాహనాలను ఏర్పాటు చేశారు.