ఉదయ్‌‌‌‌పూర్ డిక్లరేషన్‌‌ను అమలు చేయండి : ప్రమోద్ కుమార్

ఉదయ్‌‌‌‌పూర్ డిక్లరేషన్‌‌ను అమలు చేయండి : ప్రమోద్ కుమార్
  • ఉదయ్‌‌‌‌పూర్ డిక్లరేషన్‌‌ను అమలు చేయండి
  • కేసీ వేణుగోపాల్‌‌కు భువనగిరి నేత ప్రమోద్ కుమార్ విజ్ఞప్తి

న్యూఢిల్లీ, వెలుగు : టికెట్ల విషయంలో ఉదయపూర్ డిక్లరేషన్, కర్నాటక ఫార్ములాను అనుసరించాలని కాంగ్రెస్‌‌ పార్టీ నేషనల్ జనరల్ సెక్రటరీ (సంస్థాగత) కేసీ వేణుగోపాల్‌‌కు తెలంగాణ పీసీసీ జనరల్‌‌ సెక్రటరీ ప్రమోద్‌‌ కుమార్‌‌‌‌ విజ్ఞప్తి చేశారు. యాదాద్రి భువనగిరి జిల్లాలోని భువనగిరి అసెంబ్లీ స్థానాన్ని కచ్చితంగా బీసీలకు కేటాయించాలని కోరారు.

శనివారం ఢిల్లీ అక్బర్ రోడ్‌‌లోని పార్టీ హెడ్ ఆఫీసులో భువనగిరి జిల్లా ఓబీసీ విభాగం అధ్యక్షులు గోద రాహుల్ గౌడ్, భువనగిరి ఆశావాహి రామ ఆంజనేయులు గౌడ్‌‌తో కలిసి ప్రమోద్‌‌ కుమార్‌‌‌‌ కేసీ వేణుగోపాల్‌‌తో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా భువనగిరి నియోజకవర్గానికి సంబంధించిన బీసీ అభ్యర్థుల వివరాలను సమర్పించారు. పార్లమెంట్‌‌కు రెండు చొప్పున బీసీలకు మొత్తం 34 సీట్లు కేటాయించాలని కోరారు.