రెండుసార్లు చేజారిన పీఎం చాన్స్

రెండుసార్లు చేజారిన పీఎం చాన్స్

న్యూఢిల్లీ: ప్రణబ్ ముఖర్జీకి రెండుసార్లు ప్రధానమంత్రి పదవి చేపట్టే అవకాశం వచ్చి చేజారిపోయింది. 1984లో తొలిసారి చాన్స్ మిస్సయితే.. 2009లో రెండోసారి ఫేట్ అడ్డుపడింది. రాజీవ్గాంధీ ఆయనను ముద్దుగా ‘పీకేఎం’ అని పిలిచేవారు. పీఎం పదవి చేపట్టలేక .. చివరికి ప్రణబ్ ‘పీకేఎం’గానే మిగిలిపోయారు.

రాజీవ్ టైంలో..
ఇందిరా గాంధీ ప్రధానిగా ఉన్న 1980 నుంచి 1984 వరకూ ప్రణబ్ ముఖర్జీ టైమే నడిచింది. ఆయన కేపబులిటీని గుర్తించిన ఇందిర ఆయన మాటలకు విలువ ఇచ్చేవారు. ఇందిర విదేశాలకు వెళ్లినప్పుడు కేబినెట్ ను నడిపే బాధ్యత ఆయనే తీసుకునేవారు. ఒక రకంగా పార్టీలో నంబర్ టూగా మారారు. 1984లో ఇందిర హత్య తర్వాత ప్రణబ్ ప్రధాని అవుతారని ఎక్కువ మంది భావించారు. పూర్తి ప్రాక్టికల్గా ఆలోచించిన ఆయన కేబినెట్లో సెకండ్ ర్యాంక్లో ఉన్న తాను తదుపరి ప్రధాని వచ్చే వరకూ కొనసాగాలని భావించారు. కానీ ఆ నిర్ణయం ఆయన పొలిటికల్ ఫ్యూచర్నే మార్చేసింది. అధికారులంతా ప్రణబ్ నుంచి ఆర్డర్లు తీసుకోవడంతో రాజీవ్, ఆయన టీమ్ అలర్ట్ అయ్యింది. అప్పటికే రాజీవ్ గ్యాంగ్తో ప్రణబ్కు సరైన టర్మ్స్ లేవు. రాజీవ్ గాంధీ ప్రధాని బాధ్యతలు చేపట్టారు. ఎమర్జెన్సీ కేబినెట్ మీటింగ్లో ప్రణబ్ను పక్కన పెట్టారు. ఆ తర్వాత లోక్సభ ఎన్నికల్లో రాజీవ్ ఘన విజయం సాధించిన తర్వాత ప్రణబ్ను ఢిల్లీ నుంచి బెంగాల్కు పంపేశారు. ఈ పరిణామాల నేపథ్యంలో కాంగ్రెస్ నుంచి బయటికి వచ్చి ప్రణబ్ ముఖర్జీ కొత్త పార్టీ ఏర్పాటు చేశారు. నాలుగేండ్ల తర్వాత ప్రణబ్కు రాజీవ్ గాంధీ మళ్లీ ఇంపార్టెన్స్ ఇవ్వడం మొదలుపెట్టారు. ఆ సమయంలో ప్రణబ్ ముఖర్జీని రాజీవ్ గాంధీ.. పీకేఎం అని పిలిచేవారు. కాంగ్రెస్ ఎకనమిక్ స్ట్రాటజీని రూపొందించే పనిని ఆయనకు అప్పజెప్పారు. 1991లో రాజీవ్ గాంధీ చనిపోక పోయి ఉంటే ప్రణబ్ ముఖర్జీ ఫైనాన్స్ మినిస్టర్ అయ్యేవారు.

వెంటాడిన మన్మోహన్
ప్రణబ్ పొలిటికల్ లైఫ్ను మన్మోహన్సింగ్ కూడా వెంటాడారు. ఇందిర హయాంలో ఫైనాన్స్ మినిస్టర్గా ప్రణబ్ ఉంటే.. మన్మోహన్ ఆర్బీఐ గవర్నర్. పీవీ నరసింహారావు గవర్నమెంట్కు వచ్చేసరికి మన్మోహన్ ఫైనాన్స్ మినిస్టర్ అయ్యారు. కొత్త ఎకనమిక్ పాలసీ తీసుకొచ్చి పబ్లిక్ హీరో అయిపోయారు మన్మోహన్. అప్పుడు ప్రణబ్ ఫారిన్ మినిస్టర్గా ఉన్నా.. మన్మోహన్స్థాయి స్టార్డమ్ను సాధించలేదు. ఇక మన్మోహన్ ప్రధాని అయినప్పుడు ప్రణబ్ ఆయన కేబినెట్లో సీనియర్ మినిస్టర్గా ఉన్నారు. ఇక యూపీఏ 1 లాస్ట్ ఇయర్స్లో మన్మోహన్తో ప్రణబ్ రిలేషన్స్ కాస్త దెబ్బతిన్నాయి. ఇండో–యూఎస్ న్యూక్లియర్ డీల్ను లెఫ్ట్ అడ్డుకోవడంతో సర్కారు కూలిపోయినా పర్లేదని మన్మోహన్ వాదించారు. కానీ లెఫ్ట్ సపోర్ట్ లేకుంటే ప్రభుత్వం నడిచే పరిస్థితి లేదని ప్రణబ్ భావించారు. 2009 ఎన్నికల టైంలో 2004లో గెలిచిన సీట్లను నిలుపుకుంటే లెఫ్ట్ మద్దతుతో సర్కారు ఏర్పాటు చేయొచ్చని కాంగ్రెస్ భావించింది. ఈ టైంలో కాంగ్రెస్కు ఉన్న బెస్ట్ చాయిస్ మన్మోహన్ ప్లేస్లో ప్రణబ్ను పీఎంను చేయడం. 2009లో పార్టీకి ఎక్కువ సీట్లు వచ్చాయి. దాంతో లెఫ్ట్ సపోర్ట్ అవసరం లేకపోయింది. మన్మోహన్ప్రధానిగా కొనసాగారు.

For More News..

తెలంగాణపై సంతకం చేసిన ప్రణబ్