
పనాజీ: కరోనా నుంచి కోలుకోవడానికి ప్రాణాయామం, హెల్తీ డైట్, రెగ్యులర్ ఎక్సర్‌సైజ్ తనకు ఉపయోగపడ్డాయని గోవా సీఎం ప్రమోద్ సావంత్ చెప్పారు. ‘నా స్వీయ అనుభవంతో చెబుతున్నా.. హెల్తీ డైట్, రెగ్యులర్ ఎక్సర్‌సైజ్‌తోపాటు ప్రాణాయామం వైరస్ నుంచి రికవర్ కావడానికి నాకు దోహదపడ్డాయి. కరోనా నుంచి కోలుకోవడానికి రెగ్యులర్‌గా ప్రాణాయామం, మంచి డైట్ తీసుకోవాలని సూచిస్తున్నా’ అని సావంత్ పేర్కొన్నారు. ఈ నెల 2వ తేదీన ఆయనకు కరోనా పాజిటివ్‌గా తేలింది. దీంతో పది రోజుల పాటు సెల్ఫ్ ఐసోలేషన్‌కు వెళ్లిపోయారు. ఈ పీరియడ్‌లో ఎక్సర్‌సైజ్ టైమ్‌ను గణనీయంగా పెంచానన్నారు. మరో ఏడు రోజులు ఐసోలేషన్‌లోనే ఉంటానన్నారు. ఆ తర్వాత తన పనులను తిరిగి మొదలుపెడతానని పేర్కొన్నారు.