Prasannavadanam: ఇది కంటెంట్ పవర్.. ప్రసన్నవదనం అరుదైన రికార్డ్

Prasannavadanam: ఇది కంటెంట్ పవర్.. ప్రసన్నవదనం అరుదైన రికార్డ్

టాలీవుడ్ టాలెంటెడ్ నటుడు సుహాస్(Suhas) హీరోగా వచ్చిన లేటెస్ట్ మూవీ ప్రసన్నవదనం(Prasannavadanam). క్రైమ్ థ్రిల్లర్ జానర్ లో వచ్చిన ఈ సినిమాను కొత్త దర్శకుడు అర్జున్ వైకే(Arjun Yk) తెరకెక్కించారు. పేస్ బ్లైండ్ నెస్ అనే డిఫరెంట్ కాన్సెప్ట్ తో వచ్చిన ఈ సినిమా మే 3న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. టీజర్, ట్రైలర్ తో మంచి ఇంపాక్ట్ క్రియేట్ చేసిన ఈ సినిమాకు ఆడియన్స్ నుండి కూడా మంచి రెస్పాన్స్ వచ్చింది. దీంతో బాక్సాఫీస్ దగ్గర డీసెంట్ హిట్ గా నిలిచింది ఈ మూవీ.

అయితే ఓపక్క ఐపీఎల్, మరోపక్క ఎలక్షన్స్ హడావుడి కారణంగా ఈ సినిమా అనుకున్నంత ఆదరణ దక్కలేదు. అందుకే అనుకున్నదానికన్నా చాలా త్వరగా ఓటీటీలో విడుదల చేశారు మేకర్స్. ప్రముఖ ఓటీటీ సంస్థ ఆహా ఈ సినిమాను స్ట్రీమింగ్ చేసింది.  అయితే.. ఈ సినిమాకు ఓటీటీలో అనూహ్య స్పందన వచ్చింది. ఓటీటీలో విడుదలైన కొన్ని గంటల్లోనే రికార్డ్స్ వ్యూస్ రాబట్టి బ్లాక్ బస్టర్ గా నిలిచింది. ఈ క్రమంలోనే అరుదైన ఘనతను సాధించింది ఈ మూవీ.  ఆహాలో 50 మిలియన్ల స్ట్రీమింగ్ మినట్స్‌ను క్రాస్ చేసింది. ఓటీటీలో విడుదలైన చాలా తక్కువ సమయంలో 50 మిలియన్ల స్ట్రీమింగ్ మినట్స్‌ క్రాస్ చేసిన సినిమాగా రికార్డ్ క్రియేట్ చేసింది ప్రసన్నవదనం మూవీ. ఇదే విషయం ఆహా సంస్థ అధికారికంగా ప్రకటించింది.

ఇక ప్రసన్నవదనం సినిమా విషయానికి వస్తే.. ఆక్సిడెంట్ లో పేస్ బ్లైండ్ నెస్ అనే సమస్య వస్తుంది సూర్యకి. ఆ కారణాంగా అతని అందరి మొహాలు ఒకేలాగా, అందరి గొంతులు కూడా ఒకేరకంగా వినిపిస్తాయి. ఒకరోజు సూర్య ఒక మర్డర్ చూస్తాడు కానీ, పేస్ బ్లైండ్ నెస్ కారణంగా చంపినా వ్యక్తిని గుర్తుపట్టలేడు. ఇదే విషయాన్ని పోలీస్ లకు ఇన్ఫార్మ్ చేస్తాడు. మరి హత్య చేసిన వ్యక్తిని సూర్య ఎలా కనిపెట్టాడు? ఇంతకీ ఆ హత్య చేసింది ఎవరు? ఆ హత్యకి పోలీస్ లకి ఉన్న లింక్ ఏంటి? అనేది ప్రసన్నవదనం కథ.