Jai Hanuman: బ్యాక్ టూ వర్క్.. జై హనుమాన్ షూటింగ్ మొదలుపెట్టిన ప్రశాంత్?

Jai Hanuman: బ్యాక్ టూ వర్క్.. జై హనుమాన్ షూటింగ్ మొదలుపెట్టిన ప్రశాంత్?

దర్శకుడు ప్రశాంత్ వర్మ(Prasanth varma) అదిరిపోయే అప్డేట్ ఇచ్చారు. గత రెండు నెలలుగా సినీ లవర్స్ ఎదురుచూస్తున్న ఎగ్జైటింగ్ మూమెంట్ ను మొదలుపెట్టేశారు. హనుమాన్(HanuMan) సినిమా రిలీజ్ నుండి ప్రేక్షకులందరూ ఆ క్షణం కోసమే ఎదురుచూస్తున్నారు. ఇంతకీ ఆ మూమెంట్ ఏంటా అనుకుంటున్నారా? అదే జై హనుమాన్(Jai Hanuman) సినిమా షూటింగ్. అవును హనుమాన్ కు సీక్వెల్ గా జై హనుమాన్ ను అనౌన్స్ చేసినప్పటి నుండి ఆడియన్స్ ఆ సినిమా అప్డేట్స్ కోసం ఎదురుచూస్తున్నారు.

తాజాగా దర్శకుడు ప్రశాంత్ వర్మ తన ట్విట్టర్ ఖాతాలో ఒక ఫోటోను షేర్ చేశారు. ఆ ఫోటోకి బ్యాక్ టూ మై హ్యాపీ ప్లేస్.. బాబు రెడీ బాబు అంటూ రాసుకొచ్చాడు. దీంతో జై హనుమాన్ షూటింగ్ మొదలుపెట్టేశాడు అని అనుకుంటున్నారు ఆడియన్స్. అయితే ఈ వర్క్ జై హనుమాన్ కు సంబంధించిందా లేక ఆయన తీస్తున్న తరువాతి సూపర్ హీరో మూవీ అధీరాకి సంబందించిందా, లేదా ఏదైనా యాడ్ షూటా అనేది తెలియాల్సి ఉంది. 

అయితే నెటిజన్స్ మాత్రం ఇది జై హనుమాన్ షూటింగ్ అని అనుకుంటున్నారు. కారణం.. ఈమధ్య హనుమాన్ 50 డేస్ వేడుకల్లో త్వరలో జై హనుమాన్ మూవీ ఫస్ట్ లుక్ రిలీజ్ చేస్తానని చెప్పుకొచ్చారు. దీంతో ఆ సినిమాకు సంబందించిన పని మొదలుపెట్టాడు ప్రశాంత్ అని  అనుకుంటున్నారు. ఇక జై హనుమాన్ ఫస్ట్ లుక్ శ్రీరామనవమికి విడుదల చేస్తారనే వార్తలు బలంగా వినిపిస్తున్నాయి. కాబట్టి జై హనుమాన్ ఫస్ట్ లుక్ పోస్టర్ కోసమే ఈ షూట్ మొదలుపెట్టాడని కామెంట్స్ వినిపిస్తున్నాయి. ఏదిఏమైనా.. మోస్ట్ యాంటిసిపేటెడ్ మూవీగా వస్తున్న జై హనుమాన్ ఎలాంటి రికార్డ్స్ క్రియేట్ చేస్తుందో చూడాలి మరి.