
రీసెంట్‌గా ‘ఫ్యామిలీ స్టార్’గా ప్రేక్షకుల ముందుకొచ్చిన విజయ్ దేవరకొండ.. ప్రస్తుతం గౌతమ్ తిన్ననూరి తెరకెక్కిస్తున్న చిత్రంలో నటిస్తున్నాడు. ఇది షూటింగ్ జరుగుతుండగానే మరో క్రేజీ ప్రాజెక్టు తన లిస్టులో చేరనుందని తెలుస్తోంది. కేజీయఫ్, సలార్ లాంటి బ్లాక్ బస్టర్స్ అందించిన ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో విజయ్ నటించనున్నాడని ప్రచారం జరుగుతోంది. తాజాగా హైదరాబాద్ వచ్చిన ప్రశాంత్ నీల్.. ఇంటికెళ్లి మరీ విజయ్‌ను కలవడంతో ఈ న్యూస్ వైరల్ అవుతోంది. అయితే ప్రశాంత్ నీల్ ప్రస్తుతం ‘సలార్2’ తెరకెక్కించాల్సి ఉంది. అలాగే ఎన్టీఆర్‌తోనూ ఓ మూవీ చేయాల్సి ఉంది.
ఈ రెండు పూర్తి చేయాలంటే కనీసం రెండేళ్ల సమయం పడుతుంది. దీంతో అసలు విజయ్‌ను ప్రశాంత్ ఎందుకు కలిశాడా అని అనుమానాలు వస్తున్నాయి. వీరిద్దరి కాంబో నిజమే అయినా.. ఆ మూవీ సెట్స్‌కు వెళ్లాలంటే మాత్రం కొన్నాళ్లు వెయిట్ చేయాల్సిందే. అయితే ‘సలార్ 2’లోని ఓ కీలకపాత్రకు సంబంధించి వీళ్లిద్దరి మధ్య సంప్రదింపులు జరిగాయనే ప్రచారం కూడా జరుగుతోంది. దీనిపై క్లారిటీ రావాలంటే విజయ్, ప్రశాంత్‌లలో ఎవరోఒకరు అధికారికంగా ప్రకటించాల్సి ఉంది.