వికారాబాద్ కలెక్టర్ గా ప్రతీక్ జైన్ బాధ్యతలు

వికారాబాద్ కలెక్టర్ గా ప్రతీక్ జైన్ బాధ్యతలు

వికారాబాద్, వెలుగు:  జిల్లా కలెక్టర్ గా ప్రతీక్ జైన్ ఆదివారం కలెక్టరేట్ లో బాధ్యతలు చేపట్టారు. అంతకు ముందు కలెక్టర్ సి.నారాయణరెడ్డి రిలీవ్ కాగా ఆయన స్థానంలో కొత్త కలెక్టర్ ప్రతీక్ జైన్ స్వీకరించారు. నారాయణరెడ్డి నల్గొండ కలెక్టర్ గా  బదిలీపై వెళ్లగా.. భద్రాచలం ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి ప్రతీక్ జైన్  కలెక్టర్ గా వచ్చారు. ప్రతీక జైన్ కు జిల్లా అధికారులు బొకేలు అందించి ఘనస్వాగతం పలికారు.

అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ.. అందరి సహకారంతో జిల్లాను అభివృద్ధి చేస్తానన్నారు.  అడిషనల్ కలెక్టర్ లింగ్యానాయక్, వికారాబాద్, తాండూరు ఆర్డీఓలు వాసుచంద్ర, శ్రీనివాసరావు, జడ్పీ సీఈఓ సుధీర్, జిల్లా అటవీశాఖ అధికారి జ్ఞానేశ్వర్, జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ అధికారి పాల్వన్ కుమార్, డీఈఓ రేణుకదేవి, డీపీఆర్వో చెన్నమ్మ, జిల్లా షెడ్యూల్ కులాల అభివృద్ధి అధికారి మల్లేషం, డీవైఏసీ హన్మంత్ రావు, డీఏవో గోపాల్, ఎస్పీ కార్పొరేషన్ ఈడీ బాబు మోజెస్, జిల్లా ప్రొహిబిషన్, ఎక్సైజ్ సూపరిండెంట్ విజయ భాస్కర్, ఏపీఆర్ వో 
ప్రభాకర్ ఉన్నారు.