
ఖైరతాబాద్, వెలుగు: ఈ నెల 24న రవీంద్రభారతిలో ‘ప్రవాసి దివాస్–2023’ ప్రోగ్రామ్‌ను నిర్వహించనున్నట్లు తెలంగాణ డెవలప్ మెంట్ ఫోరం ప్రెసిడెంట్ డాక్టర్ డివెస్ అనిరెడ్డి తెలిపారు. గురువారం సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. విదేశాల్లో ఉంటున్న తామంతా ప్రతి రెండేళ్లకోసారి హైదరాబాద్‌కు వచ్చి తెలంగాణ వాసుల కోసం తోచిన సాయాన్ని అందిస్తున్నామన్నారు.
గ్రామాల్లో ఉండే వారికి స్కిల్ డెవలప్ మెంట్‌పై ట్రైనింగ్, ఆరోగ్య సంరక్షణపై అవగాహన కల్పిస్తామన్నారు. ప్రవాసి దివాస్ ప్రోగ్రామ్‌కు చీఫ్ గెస్టుగా డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క హాజరుకానున్నట్లు అనిరెడ్డి తెలిపారు. సమావేశంలో సంఘం మాజీ ప్రెసిడెంట్కవిత చల్లా, రణధీర్‌రెడ్డి, సీహెచ్మురళీ, రాజేశ్వరరావు పాల్గొన్నారు.