
- జేఎన్టీయూకు మేనేజ్ మెంట్ల తప్పుడు నివేదికలు
- ఫ్యాకల్టీ, ఫెసిలిటీస్ ను పట్టించుకోని ఎఫ్ఎఫ్ సీ కమిటీలు
- డమ్మీ ఫ్యాకల్టీతో తప్పుడు సమాచారం ఇచ్చారని సిబ్బంది ఫిర్యాదులు
- జేఎన్టీయూ అధికారుల చేతివాటంతో పర్మిషన్లు అని ఆరోపణలు
హైదరాబాద్. వెలుగు: తెలంగాణలోని ప్రైవేట్ ఇంజినీరింగ్ కళాశాలల్లో జవహర్ లాల్ నెహ్రూ టె క్నలాజికల్ యూనివర్సిటీ (జేఎన్టీయూ) అధికారులు తూతూ మంత్రంగా తనిఖీలు నిర్వహించారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఫ్యాకల్టీ, ల్యాబ్, ఫెసిలిటీస్ ను పట్టించుకోకుండా కాలేజీలకు అనుగుణంగా రిపోర్టులు ఇచ్చేసినట్టు తెలుస్తున్నది. ఈ విషయంపై పలు కాలేజీల సిబ్బంది. సీఎంవో అధికారులు, హయ్యర్ ఎడ్యుకేషన్ కౌన్సిల్ తో పాటు ఉన్నతాధికారులకూ లేఖలు రాశారు
జేఎన్టీయూ పరిధిలోని ఇంజినీరింగ్, ఫార్మసీ, ఎంబీఏ తదితర కాలేజీలకు 2025–-26 విద్యాసంవత్సరానికిగానూ గుర్తింపు కోసం గత నెలలో ఫ్మాక్ట్ ఫైండింగ్ కమిటీ (ఎఫ్ఎఫ్ సీ)లను నియమించారు. ఏఐసీఈటీ, రాష్ట్ర ప్రభుత్వం నిబంధనలు అమలు చేస్తున్నారా? లేదా? అనే వివరాలను సేకరించి, వర్సిటీకి ఈ కమిటీలు రిపోర్టు ఇవ్వాల్సి ఉంది. అయితే, ఒక్కో కమిటీ రోజుకు 3.4 కాలేజీలను తిరిగి.. వర్సి టీకి రిపోర్టు ఇచ్చాయి. కొన్ని కాలేజీల్లో మాత్రమే లోపాలున్నాయని నివేదిక ఇచ్చారని, వాటిని సరి చేసుకోవాలని కాలేజీలకు లేఖ రాస్తామని ఇటీవల వర్సిటీ వీసీ విలేకరులతో తెలిపారు. అయితే, చాలా కాలేజీల్లో ఎఫ్ఎఫ్ సీలు సరిగా తనిఖీలు చేయలేదని ఫిర్యాదులు అందుతున్నాయి.
డమ్మీ ఫ్యాకల్టీలు.. తాత్కాలిక ల్యాబ్ లు
కాలేజీల్లో బ్రాంచ్ లు , దానికి అనుగుణంగా ఫ్యాకల్టీ ఉందా? లేదా? వారికి సక్రమంగా జీతభత్యాలు ఇస్తున్నారా? లేదా? అనే వివరాలను ఎఫ్ఎఫ్ సీలు సేకరించాల్సి ఉంది. దీంతోపాటు మౌలిక వసతు లైన భవనాలు, సైన్స్ అండ్ కంప్యూటర్ ల్యాబ్ లు , లైబ్రరీలు, ల్యాండ్ డాక్యుమెంట్లు తదితర వాటిని పరిశీలించాల్సి ఉంటుంది. కానీ ఎఫ్ఎఫ్ సీలు నామమాత్రంగా తనిఖీలు చేసి, చేతులు దులుపుకు న్నట్టు ఆరోపణలు వస్తున్నాయి. చాలా కాలేజీల్లో సిబ్బందికి తక్కువ జీతాలు ఇస్తున్నా.. ఎక్కువ ఇస్తు న్నట్టు ఎఫ్ఎఫ్సీకి తెలిపాయి. తనిఖీల సమయంలో డమ్మీ పాకల్టీని తీసుకొచ్చి చూపించారని, ల్యాబ్ లు కూడా అప్పటికప్పుడు ఏర్పాటు చేశారనే ఆరోసణ లున్నాయి. పెద్ద కాలేజీల లిస్టులో ఉన్న గోకరాజు గంగరాజు ఇంజినీరింగ్ కాలేజీలో జరిగిన తనిఖీ లపై ఆ కాలేజీ సిబ్బంది సీఎంతోతోపాటు హయ్యర్ ఎడ్యుకేషన్ కౌన్సిల్, జేఎన్టీయూకు ఫిర్యాదు చేశారు. కాలేజీల్లో ఫ్యాకల్టీ వివరాలను పరిశీలించలేదని, బయోమెట్రిక్ అటెండెన్స్ చూడలేదని లేఖలో పేర్కొ న్నారు. ఫ్యాకల్టీకి జీతమే సక్రమంగా ఇవ్వలేదని, ఇంక్రిమెంట్ల ఇస్తున్నారా? లేదా? అనేది అధికారులు తనిఖీ చేయలేదని ఆరోపించారు. దీనిపై మరోసారి సమగ్రంగా విచారణ చేయించాలని వారు డిమాండ్ చేశారు. అదే పరిస్థితి అన్ని కాలేజీల్లోనూ ఉన్నట్లు వారు ఆరోపిస్తున్నారు.
విచారణ చేయించాలి
రాష్ట్రంలోని టెక్నికల్ కాలేజీల్లో వేతన సంఘం జీతాలు అమలుచేయడం లేదు. కానీ, అలాగే చెల్లిస్తున్నట్టు కాలేజీలు టీఏఎస్ఆర్, ఏఐసీటీఈ, ఎఫ్ఎఫ్ సీ టీమ్ లకు తప్పుడు నివేదికలు ఇచ్చాయి. దీనిపై ప్రభుత్వం సమగ్ర విచారణ చేయించాలి. ఫీజు రీయింబర్స్ మెంట్ రాలేదనే కారణంతో చాలా కాలేజీల్లో 2 నుంచి 6 నెలలుగా జీతాలివ్వడం లేదు. కొన్ని కాలేజీల్లో సిబ్బంది ఖాతాల్లో జీతాలు వేసి, మళ్లీ వెనక్కి తీసుకుంటున్నారు. జేఎన్టీయూ ఎఫ్ఎఫ్ సీ తనిఖీలపైనా సమగ్ర విచారణ చేసి, తప్పుడు నివేదికలు ఇచ్చిన కాలేజీలపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాం.
-సంతోష్ కుమార్, టీఎస్టీఎస్ఈఏ రాష్ట్ర అధ్యక్షులు-