
పద్మారావునగర్, వెలుగు: గురుద్వార్ సాహిబ్ సికింద్రాబాద్లో సిక్కులు ఆదివారం శ్రీ గురు గ్రంథ్ సాహిబ్ జీ(సిక్కుల పవిత్ర గ్రంథం)కి ప్రార్థనలు చేశారు. సాయంత్రం తిరుమలగిరి ఈఎంఈ సెంటర్ గురుద్వార్ లో గురుద్వార్సాహిబ్ సికింద్రాబాద్ ప్రబంధక కమిటీ, జీఎస్ఎస్ యువ సేవా దళం ఆధ్వర్యంలో ప్రత్యేక సమాగమ్ నిర్వహించారు. ప్రెసిడెంట్ బల్దేవ్సింగ్బగ్గా, జనరల్ సెక్రటరీ జగ్మోహన్ సింగ్, వైస్ ప్రెసిడెంట్ సురీందర్ పాల్ సింగ్ తదితరులు పాల్గొన్నారు.