పీఆర్సీపై సలహాలు, సూచనలు ఇవ్వండి: పీఆర్సీ కమిషన్

పీఆర్సీపై సలహాలు, సూచనలు ఇవ్వండి: పీఆర్సీ కమిషన్

హైదరాబాద్, వెలుగు: పీఆర్సీపై సలహాలు, సూచనలు ఇవ్వాలని ఉద్యోగులు, అసోసియేషన్లు, పెన్షనర్లు, లోకల్ బాడీల ఉద్యోగ సంఘాలను పీఆర్సీ కమిషన్  కోరింది. వచ్చే నెల 4 వరకు తమ సూచనలు, సలహాలను పోస్ట్, ఈ మెయిల్ లో పంపవచ్చని లేదా పీఆర్సీ కమిషన్ కు నేరుగా అందజేయవచ్చని శనివారం ఓ  ప్రకటనలో కమిషన్  తెలిపింది. సెక్రటేరియెట్  దగ్గర బీఆర్ కే భవన్ లోని 8వ ఫ్లోర్ లో పీఆర్సీ కమిషన్  ఆఫీస్  ఉందని పేర్కొంది. TSPRC.02.2023@GMAIL.COM మెయిల్ ఐడీకి పంపాలని సూచించింది.

రాష్ట్రంలో రెండో పీఆర్సీ ఇవ్వడానికి ఆర్థిక శాఖ మాజీ సెక్రటరీ శివశంకర్  చైర్మన్​గా, రిటైర్డ్ ఐఏఎస్ బి.రామయ్య మెంబర్​గా గత బీఆర్ఎస్  ప్రభుత్వం నిరుడు అక్టోబర్ 2న పీఆర్సీ కమిషన్ ను ఏర్పాటు చేసింది. కాగా, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు 2023 జులై 1 నుంచి పీఆర్సీ ఇవ్వాల్సి ఉంది. గత పీఆర్సీ గడువు ముగిసినందున 5% ఐఆర్​ను ప్రకటించి పీఆర్సీ కమిషన్  ఏర్పాటు చేశారు. 6 నెలల్లో పీఆర్సీ కమిషన్ రిపోర్టు ఇవ్వాలని గత ప్రభుత్వం మౌఖికంగా ఆదేశించిందని, ఈ గడువు వచ్చే నెల  31తో ముగియనుందని ఉద్యోగ సంఘాల నేతలు తెలిపారు.