
అసెంబ్లీ వేదికగా రెండు, మూడు రోజుల్లోనే ఉద్యోగులకు గౌరవప్రదమైన PRC ప్రకటిస్తామని తెలిపారు సీఎం కేసీఆర్. గవర్నర్ చేసిన ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చ సందర్భంగా సీఎం మాట్లాడారు. ఉద్యోగులపై రాష్ట్ర ప్రభుత్వానికి ఎంత ప్రేమ ఉందో గత పీఆర్‌సీ ద్వారా చూపించామన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికలు ముగిసిన క్రమంలో పీఆర్‌సీ ప్రకటిస్తామన్నారు. కరోనా కారణంగా రాష్ట్రంపై దాదాపు లక్ష కోట్ల రూపాయల భారం పడిందన్నారు. ప్రత్యక్షంగా రూ.52వేల కోట్ల ఆదాయం కోల్పోయామని.. పరోక్షంగా మరో రూ.50 వేల కోట్లు నష్టపోయామని చెప్పారు.
దేశంలోనే అత్యధిక జీతాలు తీసుకుంటున్న ఉద్యోగులుగా తెలంగాణ ఉద్యోగులు గర్వంగా చెప్పుకునే విధంగా వేతనాలు ఇస్తామని ఉద్యమ సమయంలో చెప్పామన్నారు సీఎం కేసీఆర్. ఇప్పటికే అమలు చేస్తున్నామన్నారు.