
తెలుగు ముద్దుగుమ్మలకు సొంత భాషలో కన్నా ఇతర పరిశ్రమల్లోనే అవకాశాలు ఎక్కువగా వస్తుంటాయి. రీతూ వర్మ, అంజలి, మధుశాలిని వంటి నటులంతా తమిళ్లో సత్తా చాటుతున్నారు. తాజాగా ఈ కోవలోకి మరో తెలుగు నటి చేరింది. చైల్డ్ ఆర్టిస్ట్‌గా కెరీర్ ప్రారంభించిన ప్రీతి అస్రాని హీరోయిన్గా మారి ప్రెజర్ కుక్కర్, దొంగలున్నారు జాగ్రత్త వంటి సినిమాల్లో నటించింది.
సమంత యశోదలో మంచి స్కోప్ ఉన్న రోల్లో మెరిసింది. తాజాగా కోలీవుడ్‌లో ‘కిస్’ అనే సినిమా సైన్ చేసిందట. కొరియోగ్రాఫర్ సతీష్ ఈ సినిమాతో దర్శకుడిగా మారనున్నాడు. ఇప్పటికే హీరో శశికుమార్‌తో అయోధి అనే సినిమాలో నటించిన ఈ బ్యూటీ సక్సెస్ ట్రాక్ ఎక్కింది. ఇప్పుడు కెవిన్ అనే మరో కుర్ర హీరోతో చాన్స్ కొట్టేసింది. ఈ సినిమాలో కుష్బూ కీ రోల్ చేస్తుండగా.. అనిరుధ్ రవిచందర్ సంగీతం అందిస్తున్నాడు.