నేచురల్​గా సమస్యల్ని తగ్గించుకోవాలి

నేచురల్​గా సమస్యల్ని తగ్గించుకోవాలి

ప్రెగ్నెన్సీలో ఫిజికల్​గా, ఎమోషనల్​గా చాలా ఛాలెంజ్​లు ఎదుర్కొంటారు ఆడవాళ్లు. ముఖ్యంగా హార్మోన్స్​ ఇంబాలెన్స్​ వల్ల యాక్నె, దురద, పిగ్మెంటేషన్​.. వంటి స్కిన్ సమస్యలు ​ ఇబ్బంది పెడతాయి వాళ్లని. రిలీఫ్​ కోసం ఏవైనా ప్రొడక్ట్స్ కొని వాడదామన్నా అవి ఎంతవరకు సేఫ్​ అనేది చెప్పడం కష్టం. అందుకే వీలైనంత వరకు నేచురల్​గా ఈ సమస్యల్ని తగ్గించుకోవాలి. తొమ్మిది నెలలు కచ్చితంగా ఈ బ్యూటీ రొటీన్​ ఫాలో కావాలి అంటున్నారు  డెర్మటాలజిస్ట్​ డాక్టర్​ అజయ్​ రానా. ఎలాంటి ప్రొడక్ట్స్​కి దూరంగా ఉండాలో కూడా చెప్తున్నారాయన.

  • ప్రెగ్నెన్సీలో చర్మానికి రక్త సరఫరా వేగవంతం అవుతుంది. దీనివల్ల చర్మం దురద పుడుతుంటుంది చాలామందికి. ముఖ్యంగా పొట్ట దగ్గర దురద మరీ ఎక్కువగా ఉంటుంది. ఇలాంటప్పుడు కెమికల్​ ప్రొడక్ట్స్​కి​ బదులు కలబంద గుజ్జు,  కొబ్బరి, బాదం నూనెల్ని పొట్ట దగ్గర రాయాలి. దీనివల్ల దురద తగ్గడమే కాదు చర్మం మృదువుగా, ఆరోగ్యంగా ఉంటుంది. 
  •  దురద భరించలేక చాలామంది గోళ్లతో  చర్మాన్ని గీరతారు. దాంతో ఒళ్లంతా స్ట్రెచ్​ మార్క్స్​ పడతాయి.  అవి కూడా రొమ్ము, పొట్ట భాగంలో ఎక్కువగా పడతాయి. వీటిని తగ్గించాలంటే టోపికల్​ క్రీమ్స్​ రాయాలి. ఆలివ్, కొబ్బరి నూనెల్ని కూడా నేచురల్​ మాయిశ్చరైజర్స్​గా వాడొచ్చు. 

 

  • చర్మం మీద జిడ్డు, మొటిమలు ఉంటే  గ్లైకోలిక్​ యాసిడ్​, ఆల్ఫా హైడ్రాక్సీ​ యాసిడ్​, టోపికల్​ ఎరిత్రోమైసిన్​ ఉన్న ప్రొడక్ట్స్​ వాడాలి. అయితే ఏ ప్రొడక్ట్​ అయినా డాక్టర్​ సలహా తీసుకున్న తరువాతే వాడాలి.
  • చర్మంపై మృత కణాల్ని తొలగించడానికి​ వారానికి రెండు మూడు సార్లు స్ర్కబ్స్​ వాడాలి. అలాగే ఫేస్​వాష్ .  పూలు, పండ్లతో తయారైన ఫేస్​ ప్యాక్​లు వాడితే చర్మం ఆరోగ్యంగా ఉంటుంది.
  • ప్రెగ్నెన్సీలో హార్మోన్స్​ ఇంబాలెన్స్​ వల్ల చాలామందికి పిగ్మెంటేషన్​ సమస్య వస్తుంది. అంటే చెంపలు, నుదురు, మెడ, చంకల్లో  చర్మం నల్లబడటం లేదా ఎరుపు, బ్రౌన్​, గ్రే రంగులో మచ్చలు,  ప్యాచ్​లు రావడం అన్నమాట. వీటిని కంట్రోల్ చేయడానికి రోజుకి నాలుగుసార్లు నిమ్మరసంలో, కీరా జ్యూస్​ కలిపి మచ్చలు, ప్యాచ్​లపై రాయాలి. తేనె, ఓట్స్​ ఫేస్​ మాస్క్​ కూడా మంచి రిజల్ట్​ ఇస్తాయి. పచ్చి పాలల్లో పసుపు కలిపి ముఖానికి ప్యాక్​ వేసుకున్నా ఈ సమస్య తగ్గుతుంది.
  • ప్రెగ్నెన్సీలో శరీరానికి ఎక్కువ ఎండ తగిలితే  ఈస్ట్రోజన్​ హార్మోన్​ ఉత్పత్తి పెరుగుతుంది. దానివల్ల పిగ్మెంట్​ సెల్స్​ యాక్టివ్ అయి ముఖంపై మచ్చలు వస్తాయి. అందుకే యూవీఎ, యూవీబి కిరణాల నుంచి తప్పించుకోవడానికి రోజూ ఎస్​పిఎఫ్–15 రాయాలి.  అయితే ప్రెగ్నెన్సీ మొదటి ఆరువారాల్లో  ఆక్సిబెంజోన్, ఆక్టోక్రిలిన్, ఆక్టిసలేట్​,  డైహైడ్రాక్సీ అసిటోన్ ఉన్న సన్​స్ర్కీన్స్​ వాడకూడదు. 
  •   ఈ టైంలో చాలామంది ఆడవాళ్లని  డ్రై స్కిన్​ ఇబ్బంది పెడుతుంది. దాంతో పాటు పెదాలు కూడా పగులుతాయి. ఇలాంటప్పుడు పాల మీగడ, కొబ్బరి , గోధుమ గింజల నూనెని ముఖానికి, పెదాలకి రాయాలి.  రొమ్ముకి కూడా కొబ్బరి నూనె రాయొచ్చు. గర్భిణీలు విటమిన్​–సి సీరమ్​లు వాడితే స్కిన్​ మెరుస్తుంది. ఇది యాంటీ ఆక్సిడెంట్​గా పనిచేసి కణాలని రిపేర్​ చేస్తుంది కూడా. 
  • ప్రెగ్నెన్సీలో  బిగుతు దుస్తులు ర్యాషెస్​కి కారణమవుతాయి. 
  • పర్​ఫ్యూమ్స్​​, లోషన్స్, కెమికల్స్​ ఉన్న సబ్బులు వాడొద్దు. అలాగే  రెటినాల్​, సాలిసిలిక్​ ఆమ్లం, హైడ్రోక్వినోన్​​ ప్రొడక్ట్స్​ని  బిడ్డను కనేవరకు అంటే.. తొమ్మిది నెలలు పూర్తిగా దూరం పెట్టాలి.  వీలైనంత వరకు హెయిర్​ స్ట్రైట​నింగ్​ జోలికి వెళ్లకపోవడమే మంచిది. ఎందుకంటే స్ట్రైట​నింగ్, కర్లింగ్ కోసం వాడే ప్రొడక్ట్స్​లో అమ్మోనియం థియోగ్లైకోలేట్ ఉంటుంది. నెయిల్​పాలిష్ కూడా వద్దే వద్దు. ​పారబెన్​, ఫ్రాగ్రెన్స్​, ఆల్కహాల్, సువాసనలు​ లేని పొడక్ట్స్ వాడాలి.

 

ఇవి కూడా చదవండి

సిటీలో క్రమంగా పెరుగుతున్న సైకిళ్ల వాడకం

ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్ లో ప్రేక్షకులూ రికార్డు కొట్టిన్రు..