గర్భిణుల డేటా లీక్!

గర్భిణుల డేటా లీక్!
  • ఓ ఉత్తరాది రాష్ట్రంలో1.25 కోట్ల మంది సమాచారం ఆన్ లైన్లో

డిజిటల్​ ఇండియా’.. ప్రధాని నరేంద్ర మోడీఅప్పుడు, ఇప్పుడూ గట్టిగా చెబుతున్న మాట.కానీ, ఆయన అంతా చెబుతున్నా మరి, జనం డేటాకు భద్రత మాటేంటి ? దాదాపు ఎవరి దృష్టికీ రాని గర్భిణుల డేటా లీక్ ఈ నెల ఒకటో తేదీన జరిగింది.ఉత్తరాది రాష్ట్రా నికి చెందిన వైద్య, ఆరోగ్య, సంక్షేమ శాఖ గర్భిణుల వివరాలను కనీసం పాస్​వర్డ్ రక్షణ అయినా లేని ఆన్​లైన్​ సైట్​లో పెట్టేసి నట్టు జెడ్​డీ నెట్​ పేర్కొంది. అయితే, అది ఏ రాష్ట్రమన్నది మాత్రం వెల్లడించలేదు. రోగి పేరు, చిరునామా, ఫోన్​ నెంబర్, రోగం, ప్రెగ్నెన్సీ వివరాలు, అబార్షన్లు, కాంప్లి కేషన్లవంటి వివరాలు ఆన్​లైన్​లో ప్రత్యక్షమయ్యాయి.

ఇప్పటికీ ఆన్​లైన్​లో ఆ సర్వర్ ఉన్నా.. ఈ కథనంతో ఆసమాచారాన్నం తా అందులో నుంచి తీసేసింది సదరు రాష్ట్రా నికి చెందిన ఆరోగ్య శాఖ. ఇలాంటి చర్యల వల్ల మహిళలకు తీరని నష్టం జరుగుతుందని సెంటర్ ఫర్ ఇంటర్నెట్​ అండ్​ సొసైటీ అనే మేధో సంస్థ ప్రతినిధి అంబికా టాండన్​ అంటు న్నారు. ప్రత్యేకించి అబార్షన్లు చేయించుకున్న పెళ్లి కాని మహిళల పరిస్థితి ఏంటని ప్రశ్నించారు. కొన్ని ఆస్పత్రుల్లో తమ వ్యక్తిగత సమాచారం బయటకు పొక్కకుం డా కొందరు మహిళలు అభద్రమైన అబార్షన్లవైపు మొగ్గు తున్నారని, ఇలాంటి డేటా లీకులు జరిగితే వారి శారీరక,మానసిక పరిస్థితి పై పెద్ద దెబ్బే పడుతుందని ఆమె ఆందోళన వ్యక్తం చేశారు.

ఆధార్ డేటా.. లీకులే లీకులు…

దేశంలో ఆధార్ కు సంబంధించి ముందు నుంచీ వివాదాలు నడుస్తూనే ఉన్నాయి. కొన్నే ళ్లుగా ఆధార్ డేటా లీకైన సందర్భాలు చాలా ఎక్కువగానే ఉన్నాయి.అందులో కొన్న..

మే 2017: నాలుగు ప్రభుత్వ వెబ్​సైట్లలో 13 కోట్ల మంది ఆధార్ నంబర్లు, బ్యాంకు తదితర వివరాలు లీకయ్యాయి. జనవరి 2018: దేశంలోని ఆధార్ ఉన్న ప్రతి వ్యక్తి స్థానిక సమాచారం తెలుసుకునేందు కు ఓ అంతర్జాతీయ వార్తా సంస్థ ప్రతినిధి.. ఒక్కో ఆధార్ కు ₹500 చెల్లించి నట్టు అప్పట్లో వార్తలొచ్చాయి.

మార్చి 2018: ప్రభుత్వ రంగ సంస్థ అయిన ఇండేన్​ గ్యాస్​ కస్టమర్ల ఆధార్ వివరాలు లీకయ్యాయి.

ఏప్రిల్ 2018: ఆంధ్రప్రదేశ్ లో దాదాపు 20 లక్షలమంది గర్భిణుల ఆధార్ , వివరాలు లీకయ్యాయి.

జూన్​ 2018: ప్రభుత్వ వెబ్​సైట్​కు చెందిన 70 సబ్​ డొమైన్లలోని ఆధార్ ఏపీఐ ద్వారా ఎవరైనా ఆధార్ వివరాలు తెలుసుకునే అవకాశం వచ్చింది.

జూలై 2018: మెడికల్​ ఎంట్రెన్స్​ రాస్తున్న 2.5 లక్షల మంది విద్యార్థు ల వివరాలను లీక్ చేసి అమ్ముకున్నారు కొందరు.

జనవరి 2019: లక్షలాది ఎస్​బీఐ కస్టమర్ల ఖాతాలతోపాటు ఆధార్ నంబర్లు ఆన్​లైన్​లో లీకయ్యాయి.ఇవి మచ్చుకు కొన్నే. అందరికీ తెలియకుండా పోయిన లీకులు ఇంకా ఎక్కువే ఉంటాయని నిపుణులు చెబుతున్నారు.