చెకప్ కోసం 20 కి.మీ. నడిచిన గర్భిణులు..రోడ్డు సరిగ్గా లేక..అంబులెన్స్ రాలేక

చెకప్ కోసం 20 కి.మీ. నడిచిన గర్భిణులు..రోడ్డు సరిగ్గా లేక..అంబులెన్స్ రాలేక

తిర్యాణి, వెలుగు: ట్రీట్​మెంట్ కోసం గర్భిణులు నరక యాతన పడ్డారు. అంబులెన్స్ వచ్చేందుకు దారి సరిగ్గా లేక చెకప్ కోసం సుమారు 20 కిలోమీటర్లు నడిచారు. కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా తిర్యాణి మండలం కేరెగూడకు చెందిన ముగ్గురు గర్భిణులు మంగళవారం మంత్లీ చెకప్ కోసం బయల్దేరారు.

 గ్రామానికి రోడ్డు సరిగ్గా లేకపోవడంతో104, 108 అంబులెన్సు ఊరికి 10 కిలోమీటర్ల దూరంలో ఉన్న  పంగిడిమాదర వరకు వచ్చి ఆగింది. దీంతో ముగ్గురు గర్భిణులు ఆశా వర్కర్లతో కలిసి 10 కిలోమీటర్లు  నడిచి వెళ్లి అంబులెన్సు ఎక్కారు. అక్కడి నుంచి ట్రీట్మెంట్ కోసం పీహెచ్​సీకి చేరుకున్నారు. అక్కడ వైద్య పరీక్షల తర్వాత మళ్లీ అంబులెన్స్ పంగిడి మాదరలో డ్రాప్ చేయగా, అవస్థలు పడుతూ కాలినడకనే ఇండ్లకు చేరుకున్నారు. అసలే వానకాలమని, రాత్రి వేళలో పురిటి నొప్పులు వస్తే ఏం చేసేదని కుటుంబీకులు ఆందోళన చెందుతున్నారు.