ప్రెగ్నెన్సీ వద్దనుకుంటే ఒక్క ఇంజక్షన్ చాలు

ప్రెగ్నెన్సీ వద్దనుకుంటే ఒక్క ఇంజక్షన్ చాలు

‘అంతర’ పేరిట ఇప్పటి కే పైలట్ ప్రాజెక్టు

ఇంజక్షన్‌‌తో 3 నెలలు ప్రెగ్నెన్సీ వాయిదా

ప్రభుత్వాస్పత్రుల్లో ఉచితంగా పంపిణీ

త్వరలోనే రాష్ట్రవ్యా ప్తం గా అందుబాటులోకి

అవాంఛిత గర్భాన్ని నిరోధించేందుకు సులువైన సూది మందు అందుబాటులోకి వచ్చింది. మెడ్రాక్సి ప్రొజెస్టిరాన్‌ అసిటే ట్‌ (యంపీఏ)గా పిలిచే ఈ ఇంజక్షన్‌ తో 90 రోజులపాటు గర్భం రాకుండా అడ్డుకోవచ్చు. హైదరాబాద్‌ లోని సుల్తా న్‌ బజార్‌ ప్రసూతి ఆస్పత్రిలో ‘అంతర’ పేరిట గతేడాది పైలట్‌ ప్రాజెక్టుగా ఈ ఇంజక్షన్‌ ఇవ్వడం ప్రారంభించారు. ఇప్పటివరకు 473 మంది మహిళలు ఈ ఇంజక్షన్‌ తీసుకొని తమ గర్భధారణను వాయిదా వేసుకున్నారు. సైడ్‌ ఎఫెక్ట్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ లేకుండా సత్ఫలితాలిస్తుండడంతో రాష్ట్రవ్యాప్తంగా ఈ ఇంజక్షన్‌ అందుబాటులోకి తీసుకురావాలని వైద్యారోగ్య శాఖ నిర్ణయించింది. ఈ నెల తొలి వారంలో కామారెడ్డి , నిజామాబాద్‌ జిల్లా కేంద్రాల్లోని ప్రభుత్వాస్పత్రుల్లో అందుబాటులోకి తెచ్చారు. త్వరలోనే రాష్ర్టవ్యా ప్తంగా అందుబాటులోకి రానుంది.

‘అంతర’ అంటే?

పెండ్లికి.. తొలి కాన్పు నకు, మొదటి కాన్పునకు.. రెండో కాన్పు నకు నడుమ గ్యాప్ పాటించడానికి చాలా ఉపయోగకరంగా ఉంటుందని తెలిపేలా ఈ సూదికి ‘అంతర’ అని పేరు పెట్టారు. ఈ గర్భ నిరోధక ఇంజక్షన్‌ ను మహిళల తుంటికి, చేతి కండరాలకు ఇస్తారు. ‘ఈ ఇంజక్షన్‌ చేయించుకున్న తర్వాత ఇందులోని మందు మూడు నెలలపాటు అండం తయారు కాకుండా అడ్డుకుంటుంది. గర్భ సంచి లోపలి పొర పల్చగా ఉండేలా చేసి గర్భధారణను నిరోధిస్తుంది’ అని తెలిపారు డాక్టర్లు. గరిష్టంగా వరుసగా ఆరు ఇంజక్షన్లు (ప్రతి 3 నెలలకోసారి) చేయించుకోవచ్చు. ఇంజక్షన్​ పిరియడ్​ అయిపోయాక యథావిధిగా గర్భధారణ జరుగుతుందన్నారు.