శ్రీరామ్, రమికా శివు, తపస్విని పూనాచ ప్రధాన పాత్రల్లో నటించిన కన్నడ చిత్రం ‘ప్రేమనే ఊరిలో’. మనోజ్ కుమార్ దర్శకత్వంలో చందు శ్రీనివాస్, సురేష్ కొండేటి, మమత దేవేంద్ర కలిసి నిర్మించారు. సెప్టెంబర్ 25న కన్నడలో విడుదలైన ఈ చిత్రానికి పాజిటివ్ రెస్పాన్స్ లభించగా, గాంధీ జయంతి సందర్భంగా అక్టోబర్ 2న తెలుగులో రిలీజ్ చేయనున్నట్టు ప్రకటించారు.
కర్ణాటకలో హౌస్‌ఫుల్ అవుతున్న ఈ ప్రేమ కథ చిత్రాన్ని తెలుగు ప్రేక్షకులు కూడా ఆదరిస్తారని మేకర్స్ చెబుతున్నారు. ఇదొక సోల్‌ఫుల్, ఎమోషనల్, మ్యూజికల్ లవ్ స్టోరీ అని అందరికీ నచ్చుతుందని హీరో శ్రీరామ్ అన్నాడు.
కేజీయఫ్, కాంతారా వంటి చిత్రాలకు డైలాగ్స్ అందించిన హనుమాన్ చౌదరి ఈ చిత్రానికి డైలాగ్స్ రాయగా, సునద్ గౌతమ్ సంగీతం అందిస్తున్నాడు.
