సాత్విక్ వర్మ, ప్రీతి నేహా జంటగా భాను దర్శకత్వంలో మర్రి రవికుమార్ నిర్వాహణలో కనకదుర్గారావు పప్పుల నిర్మించిన చిత్రం ‘ప్రేమిస్తున్నా’. శుక్రవారం సినిమా విడుదలవుతున్న క్రమంలో ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. యువ హీరోలు పూరి ఆకాష్, రోషన్ కనకాల ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. పూరి ఆకాష్ మాట్లాడుతూ ‘సాత్విక్ చైల్డ్ యాక్టర్‌గా ఎదిగి, ఇప్పుడు హీరోగా తన మొదటి సినిమా చేస్తున్నందుకు గర్వంగా ఉంది.
ఈ సినిమా టీజర్, పాటలు చూసినప్పుడు అతని నటన ఈ సినిమాకు స్పెషల్ అట్రాక్షన్ అని అర్థమైంది. టీమ్ అందరికీ పెద్ద విజయం రావాలని ఆశిస్తున్నా’ అని చెప్పాడు. సాత్విక్ డెబ్యూ హీరోలా కాకుండా చాలా బాగా నటించాడని రోషన్ కనకాల బెస్ట్ విషెస్ చెప్పాడు. అన్ కండిషనల్ లవ్ అనే కాన్సెప్ట్‌తో వస్తున్న అందమైన ప్రేమకథా చిత్రం ఇదని దర్శకుడు భాను తెలియజేశాడు.
