పదో తరగతి విద్యార్థులకు ప్రేరణ ప్రోగ్రామ్

పదో తరగతి విద్యార్థులకు ప్రేరణ  ప్రోగ్రామ్
  •     విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశం

హైదరాబాద్, వెలుగు: 10వ తరగతి విద్యార్థులకు వార్షిక పరీక్షలపై అవగాహన కల్పించే లక్ష్యంతో రూపొందిన  ప్రేరణ కార్యక్రమం శుక్రవారం ప్రారంభమైంది. ఆరోగ్య మిత్ర స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో  నిర్వహించనున్న ఈ కార్యక్రమాన్ని  సెక్రటేరియెట్​లో ఎడ్యుకేషన్​ ప్రిన్సిపల్ ​సెక్రటరీ బుర్రా వెంకటేశం ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ..విద్యతోనే సమాజంలో గౌరవం, -ముందడుగు సాధ్యమన్నారు. ఈ ప్రోగ్రామ్ 3 నెలల పాటు కొనసాగనున్నట్లు చెప్పారు. 

బీసీ రాజ్యాధికార సమితి వ్యవస్థాపకుడు దాసు సురేశ్ మాట్లాడుతూ.. ఆరోగ్య మిత్ర స్వచ్ఛంద సంస్థ గత పదేండ్లుగా  రాష్ట్రంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాల విద్యార్థులకు ఉచిత ప్రేరణ సదస్సులు నిర్వహించడం అభినందనీయమన్నారు. ప్రేరణ ప్రోగ్రామ్ కార్యక్రమ రూపకర్త పరికిపండ్ల అశోక్ మాట్లాడుతూ.. టెన్త్ ఎగ్జామ్ లో  ప్రభుత్వ స్కూళ్లు నూరు శాతం ఉత్తీర్ణత సాధించేలా స్టూడెంట్లకు సబ్జెక్టుల వారీగా ప్రేరణ తరగతులు నిర్వహించనున్నట్లు చెప్పారు. వివరాలకు 99893 10141ని సంప్రదించాలని సూచించారు.