
మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్ పేయి తొలి వర్ధంతి సందర్భంగా… రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్, ప్రధాని మోడీ, హోంమంత్రి అమిత్ షా, బీజేపీ వర్కింగ్ ప్రెసిడెంట్ జేపీ నడ్డా సహా …పలువురు కేంద్రమంత్రులు ఘనంగా నివాళులు అర్పించారు. వాజ్ పేయి స్మారకం సదైవ్ అటల్ దగ్గరకు చేరుకుని శ్రధ్దాంజలి సమర్పించారు.
వాజ్ పేయి దత్తపుత్రిక నమిత కౌల్ భట్టాచార్య సహా మనవరాలు ….నిహారికను కలిసి యోగ క్షేమాలు అడిగి తెలుసుకున్నారు నేతలు.
93 ఏళ్ల వయసులో వాజ్ పేయి గతేడాది ఆగస్ట్ 16న ఎయిమ్స్ లో వయో భారం, అనారోగ్యంతో కన్నుమూశారు. మరోవైపు వాజ్ పేయి జయంతిని గుడ్ గవర్నెన్స్ డే గా జరుపుకుంటోంది బీజేపీ. సదైవ్ అటల్ మెమోరియల్ ను ఒకటిన్నర ఎకరాల విస్తీర్ణంలో రూ.10 కోట్ల ఖర్చుతో నిర్మించారు. ఈ నిర్మాణానికి నిధులను అటల్ స్మృతి న్యాస్ సొసైటీ అందించింది.