సింధు మ్యాజిక్ కోట్లమందికి ఆదర్శం : రాష్ట్రపతి, ప్రధాని

సింధు మ్యాజిక్ కోట్లమందికి ఆదర్శం : రాష్ట్రపతి, ప్రధాని

వరల్డ్ బ్యాడ్మింటన్ ఛాంపియన్ షిప్ 2019 టైటిల్ నెగ్గిన తెలుగమ్మాయి పీవీ సింధుపై రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ ప్రశంసించారు. పీవీ సింధు సాధించిన ఘనత చూసి దేశం గర్విస్తోందని చెప్పారు.

ట్విట్టర్ లో అభినందన సందేశం పోస్ట్ చేసిన రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్.. ” BWF ఛాంపియన్ షిప్ గెల్చుకున్నందుకు కంగ్రాట్స్ సింధు. ఇది దేశం మొత్తానికి గర్వకారణమైన సందర్భం. కోర్టులో పీసీ సింధు చేసే ఛమక్కు, కష్టపడే తత్వం, పట్టుదల కోట్లాది మందికి ఆదర్శంగా నిలుస్తాయి. భవిష్యత్తులో పాల్గొనే అన్ని పోటీలకు కూడా అభినందనలు” అని రాష్ట్రపతి చెప్పారు.

ఫ్రాన్స్ పర్యటనలో ఉన్న ప్రధానమంత్రి నరేంద్రమోడీ … పీవీ సింధు చరిత్ర సృష్టించడంపై ఆనందం వ్యక్తం చేశారు. “బ్రహ్మాండమైన ప్రతిభ ఉన్న పీవీ సింధు.. భారత్ కు మరోసారి గర్వకారణంగా నిలిచింది. వరల్డ్ ఛాంపియన్ షిప్ లో బంగారు పతకం సాధించినందుకు అభినందనలు. ఆటపట్ల ఆమెకున్న ఇష్టం, అంకితభావం.. ప్రతి ఒక్కరినీ ఆదర్శంగా నిలుస్తాయి. రాబోయే కొన్ని తరాలవాళ్లకు పీవీ సింధు సాధించిన ఘనత స్ఫూర్తినిస్తుంది” అని మోడీ ట్వీట్ చేశారు.

హోంశాఖ మంత్రి అమిత్ షా, రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ సహా.. కేంద్రమంత్రులు, ప్రముఖులు, సెలబ్రిటీలు… పీవీ సింధు సాధించిన అద్భుతమైన రికార్డ్ పై ప్రశంసలు గుప్పిస్తున్నారు.