రాష్ట్రపతి ఆమోద ముద్ర.. చట్టంగా మారిన ఢిల్లీ సర్వీసెస్ బిల్లు

రాష్ట్రపతి ఆమోద ముద్ర.. చట్టంగా మారిన ఢిల్లీ సర్వీసెస్ బిల్లు

పార్లమెంటు వర్షాకాల సమావేశాల సందర్భంగా ఆమోదించిన నాలుగు బిల్లులకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోదం తెలిపారు. దీంతో ఢిల్లీ సర్వీసెస్ బిల్లు చట్టంగా మారింది. పార్లమెంట్‌ ఉభయ సభల్లో ఆమోదం పొందిన ఈ బిల్లుకు2023 ఆగస్టు 12 శనివారం రోజున భారత రాష్ట్రపతి  ద్రౌపది ముర్ము ఆమోద ముద్ర వేశారు. దీనితో పాటు మరో నాలుగు బిల్లులకు ఆమె ఆమోదం తెలిపారు. ఢిల్లీ ఉద్యోగుల నియామకాలు, బదిలీల అధికారాన్ని లెఫ్టినెంట్‌ గవర్నర్‌కు కట్టబెడుతూ రాజ్యసభ, లోక్‌సభలో ఆమోదం పొందింది. ఈ బిల్లుకు ఆప్ ప్రభుత్వం వ్యతిరేకించగా, బీఆర్ఎస్, కాంగ్రెస్ మద్దతిచ్చాయి. 

అయితే రాజ్యసభ, లోక్‌సభలో బీజేపీకి పూర్తి మోజార్టీ ఉండటంతో బిల్లు పాస్ అయింది. డిజిటల్ పర్సనల్ డేటా ప్రొటెక్షన్ బిల్లు, జనన మరణాల నమోదు (సవరణ) బిల్లు, జన్ విశ్వాస్ (నిబంధనల సవరణ) బిల్లు, ఢిల్లీ గవర్నమెంట్ ఆఫ్ నేషనల్ క్యాపిటల్ టెరిటరీ (సవరణ) బిల్లు ఇప్పుడు చట్టంగా సంతకం చేశారు. ఇప్పుడు సంతకం చేసిన ఈ బిల్లుల్లో కనీసం రెండు బిల్లులకు ప్రతిపక్ష పార్టీల నుంచి గట్టి ప్రతిఘటన ఎదురైంది.