అమృత్ సర్ గోల్డెన్ టెంపుల్​కు రాష్ట్రపతి

అమృత్ సర్ గోల్డెన్ టెంపుల్​కు రాష్ట్రపతి

అమృత్ సర్: రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గురువారం పంజాబ్ అమృత్ సర్ లోని గోల్డెన్ టెంపుల్ ను సందర్శించారు. అక్కడ ప్రార్థనలు చేశారు. అనంతరం లంగర్ హాల్ (కమ్యూనిటీ కిచెన్), ఇన్ఫర్మేషన్ సెంటర్ ను పరిశీలించారు. ఈ సందర్భంగా రాష్ట్రపతిని సిక్కు మత ప్రతినిధులు సత్కరించారు. రాష్ట్రపతి వెంట పంజాబ్ సీఎం భగవంత్ సింగ్ మాన్, శిరోమణి గురుద్వారా ప్రబంధక్ కమిటీ (ఎస్ జీపీసీ) చీఫ్ హర్జీందర్ సింగ్ ధామి ఉన్నారు. కాగా, రాష్ట్రపతి అయినంక తొలిసారి ముర్ము అమృత్ సర్ కు వచ్చారు. ఆమె పర్యటన సందర్భంగా భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. అంతకుముందు రాష్ట్రపతికి ఎయిర్ పోర్టులో పంజాబ్ గవర్నర్ బన్వరీలాల్ పురోహిత్, సీఎం మాన్ స్వాగతం పలికారు.