పార్లమెంట్ లో రాజ దండంతో రాష్ట్రపతికి స్వాగతం

పార్లమెంట్ లో రాజ దండంతో రాష్ట్రపతికి స్వాగతం

పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం అయ్యాయి. లోక్ సభ, రాజ్యసభల ఉమ్మడి సభలను హాజరయ్యారు భారత రాష్ట్రపతి ముర్ము. ఈ సందర్భంగా ఆమెకు ఘనంగా స్వాగతం పలికారు. ఉప రాష్ట్రపతితోపాటు ప్రధాని మోదీ, లోక్ సభ స్పీకర్ ఆమెకు పార్లమెంట్ దగ్గర ఘన స్వాగతం పలికారు. కొత్త పార్లమెంట్ లోకి రాష్ట్రపతిని రాజ దండంతో గౌరవంగా తీసుకెళ్లటం విశేషం. గత సమావేశాలకు భిన్నంగా.. రాజ దండంతో ఓ వ్యక్తి ముందు నడుస్తుండగా.. ఆ పక్కన సంగీతం వినిపిస్తుండగా.. సభలోకి ప్రవేశించారు రాష్ట్రపతి ముర్ము.  సభా వేదిక మధ్యలో.. రాష్ట్రపతి కుర్చీకి ఎదురుగా ఈ రాజ దండాన్ని ఉంచారు. 

కొత్త పార్లమెంట్ ప్రారంభోత్సవంలోనే సెంగోల్ చరిత్ర కలిగిన ఈ రాజ దండం పార్లమెంట్ లోకి ప్రవేశించింది. బడ్జెట్ సమావేశాల ప్రారంభం సందర్భంగా.. రాష్ట్రపతికి రాజ దండంతో స్వాగతం పలకటం అనేది ఇప్పుడు హాట్ టాపిక్ అయ్యింది. 2024, జనవరి 31వ తేదీ నుంచి బడ్జెట్ సమావేశాలు ప్రారంభం అవుతున్నాయి.

సెంగోల్ చరిత్ర

సెంగోల్ అనే  రాజదండానికి చారిత్రక ప్రాధాన్యత ఉందని అమిత్ షా తెలిపారు. భారతీయులకు, బ్రిటిష్ వారికి మధ్య జరిగిన అధికార మార్పిడికి ఆ రాజదండమే నిదర్శనమని గుర్తు చేశారు. స్వతంత్ర భారత మొదటి ప్రధాని జవహర్ లాల్ నెహ్రూకు బ్రిటిష్ ఇండియా చివరి వైస్రాయ్ లార్డ్ మౌంట్ బాటెన్ ఈ రాజదండం అందించారని అమిత్ షా తెలిపారు. ఈ రాజదండాన్ని సెంగోల్ అని పిలుస్తారని..  ఇది తమిళ పదం అయినా సెమ్మాయ్ (ధర్మం) నుంచి వచ్చిందని వెల్లడించారు. 

బ్యాక్ టు 1947..

‘సెంగోల్’ రాజదండం గురించి తెలుసుకోవాలంటే 1947 సంవత్సరంలో స్వాతంత్రం వచ్చిన రోజు చరిత్రను తెలుసుకోవాలి.  మన దేశానికి స్వాతంత్ర్యాన్ని ప్రకటించడానికి బ్రిటీష్ వాళ్ళు రెడీ అయ్యారు. ఈక్రమంలో ఇండియా తొలి ప్రధాన మంత్రిగా జవహర్ లాల్ నెహ్రూ అయ్యేందుకు రంగం సిద్ధమైంది. ఇటువంటి టైంలో బ్రిటీష్ ఇండియా  చివరి వైస్రాయ్ లార్డ్ మౌంట్ బాటన్ , జవహర్ లాల్ నెహ్రూ ఒక  టాపిక్ పై మాట్లాడుకున్నారు. ” మేం మీకు స్వాతంత్య్రం ఇస్తున్నాం కదా.. అధికారం మా  నుంచి మీకు బదిలీ అవుతోంది.. దీన్ని ప్రతిబించేలా ఏదైనా ప్రోగ్రాం చేస్తే బాగుంటుంది” అని నెహ్రూ తో  లార్డ్ మౌంట్ బాటన్  చెప్పారు

అధికార బదిలీకి రాజదండం

ఆ ప్రశ్న విన్న తర్వాత నెహ్రూ.. తనతో పాటు తన పక్కనే ఉన్న స్వతంత్ర భారతదేశపు మొదటి, చివరి భారతీయ గవర్నర్ జనరల్ రాజగోపాలాచారిని సలహా అడిగారట. దానికి రాజాజీ తమిళ సంప్రదాయంలో ఉన్న ఒక విధానాన్ని నెహ్రూకు వివరించారు.  ఏ దేశానికైనా కొత్త రాజుగా పదవీ బాధ్యతలు చేపట్టే సమయంలో ప్రధాన పూజారి ఓ రాజదండం ఆయనకు అందజేసే సంప్రదాయం ఉందని చెప్పుకొచ్చారు. చోళులు ఈ సంప్రదాయాన్ని అనుసరించారని తెలిపారట. దీంతో అలాంటి రాజదండం తయారు చేసే పనిని రాజాజీకి.. నెహ్రూ అప్పగించారట.