క్వీన్ ఎలిజబెత్కు ద్రౌపది ముర్ము నివాళి

క్వీన్ ఎలిజబెత్కు ద్రౌపది ముర్ము నివాళి

లండ‌న్‌ : బ్రిట‌న్ రాణి ఎలిజ‌బెత్‌ అంత్య‌క్రియ‌లు ఈ రోజు జ‌ర‌గ‌నున్నాయి. ఈ నేపథ్యంలో ఆమెకు నివాళి అర్పించేందుకు రాష్ట్ర‌ప‌తి ద్రౌప‌ది ముర్ము ఇంగ్లండ్ వెళ్లారు. బ‌కింగ్ హామ్ ప్యాలెస్‌లో జ‌రిగిన కార్యక్రమానికి హాజరైన ముర్ము.. కింగ్ ఛార్లెస్‌ 3ను క‌లుసుకున్నారు. అనంతరం లాన్‌కాస్ట‌ర్ హౌజ్‌లోని నివాళి పుస్తకంలో ద్రౌప‌ది సంత‌కం చేశారు. ఆ తర్వాత వెస్ట్‌ మినిస్ట‌ర్ హాల్‌లోని క్వీన్ ఎలిజ‌బెత్‌ పార్దీవ‌ దేహానికి ముర్ము శ్రద్ధాంజలి ఘటించారు. 

రాష్ట్రపతి ముర్ము క్వీన్ ఎలిజబెత్ అంత్యక్రియల్లో పాల్గొనేందుకు శనివారం లండన్ చేరుకున్నారు. క్వీన్కు తుది వీడ్కోలు పలికేందుకు  దాదాపు వివిధ దేశాలకు చెందిన 500 మంది ప్రతినిధులు హాజ‌రుకానున్నారు. అమెరికా అధ్య‌క్షుడు బైడెన్‌, జ‌పాన్ చ‌క్ర‌వ‌ర్తి న‌రుహితో, చైనా ఉపాధ్య‌క్షుడు వాంగ్ క్విషాన్‌, ద‌క్షిణాఫ్రికా అధ్య‌క్షుడు సిరిల్ రామ‌ఫోసోలు అంత్యక్రియల్లో పాల్గొంటారు.