నేషనల్ స్పోర్ట్స్ అండ్ అడ్వెంచర్ అవార్డ్స్ ప్రదానం చేసిన రాష్ట్రపతి

నేషనల్ స్పోర్ట్స్ అండ్ అడ్వెంచర్ అవార్డ్స్  ప్రదానం చేసిన రాష్ట్రపతి

రాష్ట్రపతి భవన్‌లో జరిగిన నేషనల్ స్పోర్ట్స్ అండ్ అడ్వెంచర్ అవార్డ్స్ 2022 వేడుకలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము బ్యాడ్మింటన్ ప్లేయర్‌లు లక్ష్య సేన్, ప్రణయ్ హెచ్‌ఎస్‌లకు అర్జున అవార్డును ప్రదానం చేశారు. వీరితో పాటు పారా షూటింగ్ కోచ్ సుమా సిద్ధార్థ్ షిరూర్, రెజ్లింగ్ కోచ్ సుజీత్ మాన్‌, బాక్సింగ్ కోచ్ మహ్మద్ అలీ కమర్‌,రెజ్లింగ్ కోచ్ రాజ్ సింగ్‌ లకు ముర్ము ద్రోణాచార్య అవార్డును అందజేశారు. రాష్ట్రపతి భవన్‌లో జరిగిన ఈ అవార్డ్స్ 2022 వేడుకలో ప్రెసిడెంట్ ద్రౌపది ముర్ము చెస్ ప్లేయర్ ఆర్ ప్రజ్ఞానానందకు అర్జున అవార్డును ప్రదానం చేశారు.