త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించిన రాష్ట్రపతి ముర్ము

త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించిన రాష్ట్రపతి ముర్ము

ఢిల్లీ : కర్తవ్య పథ్లో గణతంత్ర వేడుకలు ఘనంగా జరిగాయి. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం త్రివిధ దళాల గౌరవ వందనం స్వీకరించారు. జాతీయ గీతం ఆలపించిన అనంతరం 21 గన్ సెల్యూట్ స్వీకరించారు. ఈ వేడుకలకు ముఖ్య అతిథిగా ఈజిప్టు అధ్యక్షుడు అబ్దెల్‌ ఫతా హాజరయ్యారు. రిపబ్లిక్ డే వేడుకల్లో ఉప రాష్ట్రపతి జగదీప్ ధన్ ఖడ్, ప్రధాని నరేంద్రమోడీ, పలువురు కేంద్ర మంత్రులు పాల్గొన్నారు. 

రాజ్ పథ్ పేరును కర్తవ్య పథ్ గా మార్చిన అనంతరం తొలిసారి నిర్వహిస్తున్న గణతంత్ర వేడుకల్లో పరేడ్ ఆకట్టుకుంది. ఈసారి ఈజిప్ట్ కు చెందిన సైనిక దళాలు పరేడ్ లో పాల్గొన్నాయి. గణతంత్ర వేడుకల్లో ఈసారి సామాన్యులకు పెద్దపీట వేశారు. రిక్షాకార్మికులు, చిరువ్యాపారులకు పరేడ్ చూసేందుకు అవకాశం కల్పించారు.