
వచ్చే ఎన్నికల్లో తమకు 5 లేదా 8 సీట్లు ఇవ్వాలని తెలంగాణ పద్మశాలి సంఘం అధ్యక్షులు మచ్చ ప్రభాకర్ డిమాండ్ చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా 30 లక్షల బలగం పద్మశాలిలు ఉన్నారని.. కనీసం 20 నియోజక వర్గాల్లో గెలుపు ఓటములు శాసించే సత్తా పద్మశాలీలకు ఉందన్నారు. తమకు రావాల్సిన వాటా ఎవరిస్తారో ఆ పార్టీకే మద్దతు ఇస్తామన్నారు.
అఖిల భారత పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో సరూర్ నగర్ ఇండోర్ స్టేడియంలో పద్మశాలి రాజకీయ శంఖారావం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడిన మచ్చ ప్రభాకర్.. ఏ నియోజకవర్గంలో పద్మశాలి అభ్యర్థులు ఎన్నికల్లో నిలబడతారో వారికే పద్మశాలీలు ఓటేస్తారని లేకపోతే..నోటాకు ఓటేస్తారని చెప్పారు. సగానికి పైగా నియోజకవర్గాల్లో వేల సంఖ్యలో ఓట్లు పద్మశాలిలకే ఉన్నాయన్నారు. ఎన్నికల్లో తమ వాటా సీట్లు ఇవ్వకపోతే ఐక్యంగా పోరాడి తమ సత్తా చాటుతామని హెచ్చరించారు.