నల్సార్, సెంట్రల్‍ వర్సిటీలే టాప్

నల్సార్, సెంట్రల్‍ వర్సిటీలే టాప్

వెలుగు: జాతీయ స్థాయి విద్యాసంస్థల పనితీరు ఆధారంగా ఏటా విడుదల చేసే ‘ఇండియా ర్యాంకింగ్స్–2019’ సోమవారం న్యూ ఢిల్లీలో రాష్ట్రపతి రామ్‌‌‌‌నాథ్ కోవింద్ విడుదల చేశారు. ఉత్తమవర్సిటీల జాబితాలో నల్సార్‍ వర్సిటీ 3వ స్థానం కైవసం చేసుకొని గ్రేటర్ పరిధి లో టాప్ లో నిలిచింది. ఓవరాల్ కేటగిరీల్లో యూనివర్సిటీ ఆఫ్‍ హైదరాబాద్‍ 11వ స్థానం, ఉస్మానియా వర్సిటీ 43వ స్థానం దక్కించుకున్నాయి. ఎన్‌‌‌‌ఐటీ వరంగల్‌ 61 ర్యాంకు కైవసం చేసుకుంది. ఉత్తమ వర్సిటీ విభాగంలో యూనివర్సిటీ ఆఫ్‍ హైదరాబాద్‍ 4, ఉస్మానియా 26, ప్రొఫెసర్జయశంకర్‍ అగ్రికల్చర్‍ వర్సిటీ 79, ఇఫ్లూ 113,కేయూ 166, మౌలానా ఆజాద్‌‌‌‌ ఉర్దూ వర్సిటీ 175,ఐఐఐటీ హైదరాబాద్‍ 82 వ స్థానంలో నిలిచాయి.

ఇంజినీరింగ్‍ విభాగంలో ఇండియన్‍ ఇన్ స్టిట్యూట్‍ ఆఫ్‍ టెక్నాలజీ 8, ఐఐఐటీ హైదరాబాద్‍ 39, జేఎన్ టీయూ45, యూనివర్సిటీ ఆఫ్‍ ఇంజినీరింగ్‍ 83, సీబీఐటీ99వ స్థానాలను కైవసం చేసుకున్నాయి. దేశంలోని ఉత్తమ వర్సిటీగా బెంగళూరులోని ఇండియన్ ఇన్‌‌‌‌స్టి ట్యూట్ ఆఫ్ సైన్స్ ఎంపికైంది. ఓవరాల్ జాబితాలో ఐఐటీ మద్రాస్ మొదటి స్థానంలో నిలిచింది. వర్సిటీలు, ఇంజినీరింగ్‍, ఇంజినీరింగ్ కాలేజీలు, ఫార్మసీ, మేనేజ్ మెంట్‍, మెడికల్, ఆర్కిటెక్చర్‍, లా, ఓవరాల్ విభాగాల్లో ‘నేషనల్‌ ఇనిస్టిట్యూట్‌‌‌‌ ఆఫ్‌‌‌‌ ర్యాంకింగ్‌‌‌‌ ఫ్రేం వర్క్‌‌‌‌(ఎన్‌‌‌‌ఐఆర్‌‌‌‌ఎఫ్‌‌‌‌), అటల్ ర్యాంకింగ్ ఆఫ్ఇన్‌‌‌‌స్టిట్యూ షన్స్ ఫర్ ఇన్నోవేషన్ అచీవ్‌‌‌‌మెంట్స్(ఏఆర్‌‌‌‌ఐఐఏ) కింద ర్యాంకులను కేటాయించారు.

ఇంజినీరింగ్‌‌‌‌లో తగ్గిన ర్యాంకులు
ఇంజినీరింగ్‌‌‌‌ విభాగంలో గతేడాదితో పోలిస్తే తెలంగాణ విద్యా సంస్థలకు ర్యాంకులు తగ్గాయి. ఐఐటీ హైదరాబాద్‌‌‌‌కు గతేడాది 9వ ర్యాంకు రాగా..ఈసారి 8వ ర్యాంకు సాధించింది.