నవభారత్ నిర్మాణమే కేంద్ర ప్రభుత్వ లక్ష్యం

నవభారత్ నిర్మాణమే కేంద్ర ప్రభుత్వ లక్ష్యం

సబ్ కా సాత్, సబ్ కా వికాస్, సబ్ కా విశ్వాస్ లక్ష్యంగా పనిచేస్తున్నామన్నారు రాష్ట్రపతి. పార్లమెంట్ సెంట్రల్ హాల్ లో ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగించారు రామ్ నాథ్ కోవింద్. నవభారత్ నిర్మాణమే లక్ష్యంగా.. పేదరిక నిర్మూలనకు, గ్రామీణ ప్రాంతాల సౌకర్యాల కోసం కేంద్ర ప్రభుత్వం పనిచేస్తుందన్నారు. గత ఏడు నెలల్లో చరిత్రాత్మక చట్టాలు చేశామన్నారు. రామ్ మందిర్ పై తీర్పు, ఆర్టికల్ 370 రద్దు, కర్తార్ పూర్ కారిడార్ చరిత్రాత్మకమని చెప్పారు. జమ్ము కాశ్మీర్‌, లడఖ్‌ ప్రజలకు దేశ ప్రజలతో సమానంగా హక్కులు లభించాయని ఆయన చెప్పారు. కాశ్మీర్‌ వ్యాలీలో వివిధ విద్యాసంస్థలు ప్రారంభించనున్నామని అన్నారు.

CAAతో గాంధీ చెప్పిన మాటలు నిజమయ్యాయన్నారు. ఫసల్ బీమా యోజనతో 5కోట్ల మంది రైతులకు సాయం చేస్తున్నామన్నారు రాష్ట్రపతి. అన్నదాతల సంక్షేమం కోసం తమ ప్రభుత్వం అనేక పథకాలు ప్రవేశపెట్టిందని, రైతుల అకౌంట్లలోకి 12 వేల కోట్ల రూపాయిలు నేరుగా జమ చేశామని ఆయన అన్నారు. రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేయడానికి అనేక కార్యక్రమాలు చేపట్టామని చెప్పారు. ప్రధాన్‌మంత్రి కిసాన్‌ సమ్మాన్‌తో 8 కోట్ల మంది రైతులకు ప్రయోజనం కలుగుతోందని అన్నారు. గిరిజనుల కోసం అనేక పథకాలను ప్రభుత్వం తీసుకువచ్చిందని ఆయన అన్నారు.

president-ramnath-kovind-speech-at-parliament-during-budget-session-2020