
శీతాకాల విడిదికోసం హైదరాబాద్ వచ్చిన రాష్ట్రపతి గౌరవార్ధం రాజ్ భవన్ లో తేనీటివిందు ఇస్తున్నారు గవర్నర్ తమిళసై. కార్యక్రమానికి రాష్ట్ర సీఎం కేసీఆర్ తో పాటు..హిమాచల్ గవర్నర్ దత్తాత్రేయ, కేంద్రంమంత్రి కిషన్ రెడ్డి, స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి, మండలిచైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, హైకోర్ట్ చీఫ్ జస్టిస్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్, పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో రెడ్ క్రాస్ కు సంబంధించిన మొబైల్ యాప్ ను ఆవిష్కరించనున్నారు రాష్ట్రపతి కోవింద్.