
న్యూఢిల్లీ: 2008 మాలేగావ్ పేలుళ్ల కేసులో నిర్దోషిగా విడుదలైన మాజీ ఎంపీ ప్రజ్ఞా ఠాకూర్ సంచలన కామెంట్స్ చేశారు. ఈ కేసు విచారణ సమయంలో ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్లు నరేంద్ర మోదీ, యోగి ఆదిత్యనాథ్, ఆర్‌ఎస్‌ఎస్ చీఫ్ మోహన్ భగవత్ పేర్లు చెప్పాలని తనను ఒత్తిడి చేశారని ఆరోపించారు.
శనివారం ప్రజ్ఞా ఠాకూర్ మీడియాతో మాట్లాడారు. ‘‘బీజేపీ సీనియర్నేత రామ్మాధవ్ సహా పలువురి పేర్లు చెప్పాలని నన్ను వాళ్లు ఒత్తిడి చేశారు. నన్ను హింసించారు. అక్రమంగా దవాఖానలో నిర్బంధించారు. నేను గుజరాత్‌లో నివసించడం వల్ల మోదీ పేరు చెప్పాలని అన్నారు. వారు నాతో అబద్ధం చెప్పించాలని చూశారు. అయితే నేను అబద్ధం చెప్పలేదు” అని పేర్కొన్నారు.