నీరజ్‌‌పైనే ఇండియా ఆశలు

నీరజ్‌‌పైనే ఇండియా ఆశలు

బుడాపెస్ట్‌‌: ఒలింపిక్స్‌‌లో బంగారు పతకంతో చరిత్ర సృష్టించిన ఇండియా స్టార్​ జావెలిన్​ త్రోయర్​ నీరజ్​ చోప్రా తన ఖాతాలో వెలితిగా ఉన్న వరల్డ్​అథ్లెటిక్స్‌‌ ​గోల్డ్‌‌పై గురి పెట్టాడు. శనివారం బుడాపెస్ట్‌‌లో మొదలయ్యే వరల్డ్‌‌ చాంపియన్‌‌షిప్స్‌‌లో టైటిల్‌‌ టార్గెట్‌‌గా బరిలోకి దిగుతున్నాడు.  అతను గోల్డ్‌‌ గెలిస్తే లెజెండరీ షూటర్‌‌ అభినవ్‌‌ బింద్రా తర్వాత వ్యక్తిగత క్రీడలో  ఒలింపిక్‌‌, వరల్డ్‌‌ చాంపియన్‌‌ అయిన ఇండియా రెండో అథ్లెట్‌‌గా నిలుస్తాడు. ఇండియాకే చెందిన డీపీ మను, కిశోర్‌‌ జెనా కూడా  జావెలిన్‌‌ త్రోలో బరిలో ఉన్నారు.  విమెన్స్‌‌ 100 మీ. హర్డిల్స్‌‌లో తెలుగమ్మాయి యెర్రాజి జ్యోతి, మెన్స్‌‌ లాంగ్‌‌ జంప్‌‌లో జెస్విన్‌‌ అల్డ్రిన్‌‌, మురళీ శ్రీశంకర్‌‌,3000మీ. స్టీపుల్‌‌ఛేజ్‌‌లో అవినాశ్‌‌ సాబ్లేపై అంచనాలున్నాయి. పోటీల తొలి రోజు 20కి.మీ రేస్‌‌ వాకర్లు ఆకాశ్‌‌ దీప్‌‌ సింగ్‌‌, వికాశ్‌‌ సింగ్‌‌, పరమ్‌‌జీత్‌‌, భావనా జాట్‌‌ బరిలోకి దిగనున్నారు. విమెన్స్‌‌ లాంగ్‌‌ జంప్‌‌లో శైలీ సింగ్‌‌, మెన్స్‌‌ 1500మీ హీట్స్‌‌లో కుమార్‌‌ జరోప్‌‌, ట్రిపుల్‌‌ జంప్‌‌ క్వాలిఫికేషన్‌‌ రౌండ్‌‌లో ప్రవీణ్‌‌ చిత్రవేల్‌‌, అబ్దుల్లా అబూబేకర్‌‌,  ఎల్డోస్‌‌ పాల్‌‌ పోటీ పడనున్నారు.