పన్నెండేండ్లలో నీళ్లు లేవ్.. నియామకాల్లేవ్..సమ్మక్క, సారలమ్మ స్ఫూర్తితో సామాజిక తెలంగాణ కోసం పోరాడుదాం

పన్నెండేండ్లలో నీళ్లు లేవ్.. నియామకాల్లేవ్..సమ్మక్క, సారలమ్మ స్ఫూర్తితో సామాజిక తెలంగాణ కోసం పోరాడుదాం
  •     మేడారం జాతరలో అమ్మవార్లకు ఎమ్మెల్సీ కవిత మొక్కులు

ములుగు, వెలుగు: కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో పన్నెండేండ్లలో నీళ్లు, నియామకాలు సాధించుకోలేకపోయామని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పేర్కొన్నారు. ఆదివాసీ వీర వనితలు సమ్మక్క, సారలమ్మ స్ఫూర్తితో సామాజిక తెలంగాణ కోసం పోరాటం చేద్దామని ఆమె పిలుపునిచ్చారు. మేడారం జాతర సందర్భంగా శుక్రవారం ఆమె అమ్మవార్లను దర్శించుకున్నారు.

 చీరె, సారె సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం అమ్మవారికి బంగారం తులాభారం సమర్పించుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ కవిత మాట్లాడుతూ.. సమ్మక్క, సారలమ్మ వనదేవతలంటేనే ఆశీర్వదించే అమ్మలని, వారి దయతో తెలంగాణ బాగుండాలని కోరుకుంటున్నానన్నారు.

 తెలంగాణ కోసం అందరం నిలబడాల్సిన అవసరం వచ్చిందన్నారు. సమ్మక్క సారలమ్మ స్ఫూర్తితో మరోసారి మన హక్కులను, నీళ్లు, నిధులు, నియామకాలను సాధించుకోవాలన్నారు. మహాజాతరలో ఏర్పాట్లు బాగున్నాయన్నారు.