మళ్లీ పెట్రో మోత.. హైదరాబాద్ లో ఎంతంటే?

మళ్లీ పెట్రో మోత.. హైదరాబాద్ లో ఎంతంటే?

పెట్రోల్,డీజిల్ ధరలను మరోసారి పెంచాయి ఆయిల్ కంపెనీలు. లీటర్ పెట్రోల్ పై 24 పైసలు, డీజిల్ పై 27 పైసలు పెంచాయి. దీంతో ఢిల్లీలో లీటర్ పెట్రోల్ ధర  92 రూపాయల 64 పైసలకు చేరగా.... లీటర్ డీజిల్ 83 రూపాయల 28 పైసలకు చేరింది. ఇక హైదరాబాద్ లో లీటర్ పెట్రోల్ ధర 96 రూపాయల 21 పైసలుగా ఉంది. లీటర్ డీజిల్ 90 రూపాయల 73 పైసలకు  చేరింది. ఇక ముంబైలో లీటర్ పెట్రోల్ ధర 99 రూపాయలకు చేరువ కాగా...రాజస్థాన్ లోని శ్రీ గంగానగర్ లో ఇప్పటికే లీటర్ పెట్రోల్ ధర వంద రూపాయలు దాటింది.