జనానికి శుభవార్త : వచ్చే 2 నెలలు ధరలు పెరిగేది లేదంట..!

జనానికి శుభవార్త : వచ్చే 2 నెలలు ధరలు పెరిగేది లేదంట..!

ఈ పండుగ సీజన్‌లో నిత్యావసర ఆహార పదార్థాల ధరలు స్థిరంగా ఉంటాయని కేంద్ర ఆహార కార్యదర్శి సంజీవ్ చోప్రా తెలిపారు. ప్రస్తుత 2023-24 మార్కెటింగ్ సంవత్సరంలో (అక్టోబర్-సెప్టెంబర్) గోదుమ, బియ్యం, పంచదార, ఎడిబుల్ ఆయిల్స్ వంటి ముఖ్యమైన ఆహార పదార్థాల దేశీయ సరఫరా, ధరలపై కార్యదర్శి మీడియాకు వివరించారు.

“పండుగ సీజన్‌లో ధరలు స్థిరంగా ఉంటాయని భావిస్తున్నాం. మేము పండుగ సీజన్‌లో ఎలాంటి పెంపుదల (ఆహార వస్తువుల ధరలలో) ఊహించడం లేదు. రాబోయే రెండు నెలల వరకు ఈ ధరలు స్థిరంగా ఉంటాయి అని చోప్రా విలేకరులతో అన్నారు. ధరల స్థిరీకరణ కోసం ప్రభుత్వం ఇటీవల కొన్ని నిర్ణయాలు తీసుకుందని ఆయన తెలిపారు. వాణిజ్య విధానం లేదా స్టాక్ పరిమితి నిబంధనలు అయినా ప్రభుత్వం ఇటీవల తన ఆదేశాల మేరకు అన్ని సాధనాలను ఉపయోగించిందన్నారు. ఇవి ధరల స్థిరంగా ఉండేలా చూసుకోవడానికి సాధనాలు ఉపయోగించబడ్డాయని చోప్రా తెలిపారు. కొత్త మార్కెటింగ్ సంవత్సరం ప్రారంభమైన అక్టోబర్ 1న షుగర్ ఓపెనింగ్ స్టాక్ 57 లక్షల టన్నులుగా ఉందని ఆయన చెప్పారు.

ప్రభుత్వం ఈ ఏడాది మరోసారి అక్టోబర్ 31 తర్వాత చక్కెర ఎగుమతులపై ఆంక్షలను పొడిగించింది. తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకు, పండుగ సీజన్‌లో దేశీయ మార్కెట్‌లో వస్తువుల లభ్యతను పెంచే లక్ష్యంతో ఈ చర్య తీసుకుంది. గతంలో ఈ ఏడాది అక్టోబర్ 31 వరకు ఆంక్షలు విధించారు. “చక్కెర (ముడి చక్కెర, తెల్ల చక్కెర, శుద్ధి చేసిన చక్కెర, సేంద్రీయ చక్కెర) ఎగుమతిపై పరిమితి అక్టోబర్ 31, 2023 తర్వాత తదుపరి ఆర్డర్ వరకు పొడిగించబడింది. ఇతర షరతులు మారవు” అని డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ ఫారిన్ ట్రేడ్ (DGFT) ఒక నోటిఫికేషన్‌లో తెలిపింది.