Good News : 200 రూపాయలు తగ్గనున్న గ్యాస్ సిలిండర్ ధర

Good News : 200 రూపాయలు తగ్గనున్న గ్యాస్ సిలిండర్ ధర

దేశం మొత్తం ఎన్నో సంవత్సరాలుగా ఎదురుచూస్తున్న మంచి వార్త ఇది. ఇంట్లో ఉపయోగించే గ్యాస్ సిలిండర్ ను భారీగా తగ్గించటానికి కేంద్ర ప్రభుత్వం ఆలోచన చేస్తుంది. పది, 20 రూపాయలు కాకుండా ఏకంగా 200 రూపాయల వరకు ధర తగ్గనున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ మేరకు జాతీయ పత్రికలు అన్నీ కథనాలు ప్రచురిస్తున్నాయి. ఆగస్ట్ 29వ తేదీ ఢిల్లీలో కీలక సమావేశం జరిగినట్లు తెలుస్తుంది. 

ప్రస్తుతం దేశంలో 14 కేజీల వంట గ్యాస్ సిలిండర్ ధర 11 వందల రూపాయల వరకు ఉంది. మోదీ ప్రధానమంత్రి కాక ముందే ఈ గ్యాస్ సిలిండర్ ధర 450 రూపాయలుగా ఉంది. ఈ తొమ్మిదేళ్ల కాలంలో మూడింతలు పెరిగింది. దీనికితోడు నిత్యావసర సరుకుల ధరలు సైతం భారీగా పెరిగాయి. ఇది మధ్యతరగతి కుటుంబాలపై తీవ్ర ప్రభావం చూపిస్తుంది. అన్నింటి కంటే ముఖ్యంగా దేశంలో ఎన్నికలు రాబోతున్నాయి. ఈ క్రమంలోనే గ్యాస్ సిలిండర్ ధరను 200 రూపాయలు తగ్గించాలని కేంద్రం ఆలోచన చేస్తున్నట్లు సమాచారం. 

రాబోయే ఐదు రాష్ట్రాల ఎన్నికల క్రమంలోనే.. మధ్యప్రదేశ్ సీఎం శివరాజ్ సింగ్ చౌహాల్ తన ఎన్నికల హామీ కింద గ్యాస్ సిలిండర్ ధరపై 250 రూపాయల తగ్గింపు ప్రకటించారు. తగ్గించిన ధరను నేరుగా మహిళల ఖాతాలో వేస్తామని.. ఇది రాఖీ పండుగకు గిఫ్ట్ అని ప్రకటించారు.  

గ్యాస్ సిలిండర్ ధరపై విపక్షాలు సైతం చాలా విమర్శలు చేస్తున్నాయి. ఈ క్రమంలోనే ఆయా రాష్ట్ర ప్రభుత్వాలకు అవకాశం ఇవ్వకుండా.. కేంద్రమే ధరను 200 రూపాయల వరకు తగ్గించటం ద్వారా ధరలను కూడా అదుపు చేసినట్లు ఉంటుందనే ఆలోచన చేస్తున్నట్లు సమాచారం. అయితే ఇది ఎప్పటి నుంచి అమల్లోకి వస్తుంది.. అధికారికంగా ఎప్పుడు ప్రకటిస్తారు అనేది మాత్రం వేచి చూడాల్సిందే.