వీడియో వైరల్: చర్చి ఫాదర్ ఆశీర్వదించబోతుంటే చిన్నారి ఏం చేసిందో తెలుసా?

వీడియో వైరల్: చర్చి ఫాదర్ ఆశీర్వదించబోతుంటే చిన్నారి ఏం చేసిందో తెలుసా?

న్యూఢిల్లీ: సోషల్ మీడియాలో ప్రతి రోజూ చాలా వీడియోలు వైరల్ అవుతుంటాయి. వాటిలో కొన్ని వీడియోలు మాత్రం కడుపుబ్బా నవ్విస్తాయి. తాజాగా ఓ చిన్నారి వీడియో అందర్నీ ఆకట్టుకుంటోంది. చర్చి ఫాదర్‌‌కు సదరు పాప హైఫై ఇచ్చిన వీడియోను చూస్తే ఎవరికైనా నవ్వొచ్చేస్తుంది. వివరాలు.. చర్చిలో ఓ మహిళ తన పాపతో కలసి వెళ్లింది. ప్రార్థనల అనంతరం చర్చి ఫాదర్ వారికి దీవెనలు ఇవ్వడానికి ముందుకొచ్చాడు. చిన్నారి వైపు చేయి పెట్టి ఫాదర్ దీవెనలు ఇస్తుండగా.. ఆ పాప తనకు హైఫై ఇస్తున్నాడని భావించి ఫాదర్ కు హైఫై ఇవ్వబోయింది. చిన్నారి చేష్టకు సదరు ఫాదర్ నవ్వు ఆపుకోలేకపోయారు. ఎలాగోలా చేతిని అడ్డం పెట్టుకొని నవ్వును కంట్రోల్ చేసుకున్నారు. ఈ వీడియో నెట్‌‌లో వైరల్ అవుతోంది. ఇప్పటికే ఈ వీడియోకు 2.3 మిలియన్ల వ్యూస్ వచ్చాయి. అమాయకపు చిన్నారి హైఫై వీడియోను మీరూ లుక్కేయండి.