ఢిల్లీలో గాలి కాలుష్యం కారణంగా స్కూళ్లు బంద్

ఢిల్లీలో గాలి కాలుష్యం కారణంగా స్కూళ్లు బంద్

దేశ రాజధాని ఢిల్లీలో గాలి కాలుష్యం అంతకంతకూ పెరుగుతోంది. ఎయిర్ క్వాలిటీ రోజురోజుకూ తగ్గిపోతుండటంపై ప్రజల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. ఈ నేపథ్యంలో ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ కీలక నిర్ణయం తీసుకున్నారు. రేపట్నుంచి ప్రైమరీ స్కూళ్లు బంద్ చేస్తున్నట్లు ప్రకటించారు. కాలుష్యం తగ్గే వరకు స్కూళ్లు మూసేవేస్తామని చెప్పారు. పంజాబ్ సీఎం భగవంత్ మాన్ తో కలిసి మీడియాతో మాట్లాడిన కేజ్రీవాల్ ఈ మేరకు నిర్ణయం వెలువరించారు. ప్రైమరీ స్కూళ్లకు సెలవులు ప్రకటించిన ప్రభుత్వం 5 నుంచి 8వ తరగతి విద్యార్థుల ఔట్ డోర్ యాక్టివిటీస్పై నిషేధం విధించారు.

వాయు కాలుష్యం పెరుగుతున్నందున ఢిల్లీలో సరిబేaసి విధానం అమలు చేయడంపై ఆలోచిస్తున్నట్లు కేజ్రీవాల్ చెప్పారు. వాయు వాయు కాలుష్యానికి పంజాబ్ ప్రభుత్వమే కారణమన్న విమర్శలపైనా ఆయన స్పందించారు. ఆప్ సర్కార్ ఏర్పడి 6 నెలలే అయిందనీ... వచ్చే ఏడాది కల్లా రైతులు పొలాల్లో గడ్డిని కాల్చకుండా పకడ్బందీ చర్యలు తీసుకుంటామని కేజ్రీవాల్ స్పష్టం చేశారు.