రాష్ట్రంలో పీహెచ్‌‌సీలు ఖాళీ

రాష్ట్రంలో పీహెచ్‌‌సీలు ఖాళీ

హైదరాబాద్, వెలుగు : ప్రైమరీ హెల్త్ సెంటర్లు ఖాళీ అవుతున్నాయి. రిటైర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మెంట్లు, సర్దుబాట్లు, ఇన్‌‌‌‌‌‌‌‌సర్వీస్ పీజీ కోటాతో వందల మంది డాక్టర్లు పీహెచ్‌‌‌‌‌‌‌‌సీలను వీడారు. 1,369 మంది డాక్టర్లు ఉండాల్సిన చోట, 700 మందే ఉన్నారు. ఇందులోనూ వంద మందికిపైగా డాక్టర్లు, ఇన్‌‌‌‌‌‌‌‌సర్వీస్ కోటాలో పీజీ చదవడానికి వెళ్తున్నారు. ఈ దెబ్బతో మరింత కొరత ఏర్పడనుంది. వందల కోట్లు పెట్టి మెడికల్ కాలేజీలు కడ్తున్న ప్రభుత్వం.. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను పట్టించుకోకపోవడంపై డాక్టర్లు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఆదిలోనే రోగాలకు చెక్ పెట్టేందుకు పీహెచ్‌‌‌‌‌‌‌‌సీలు ఎంతో కీలకం. కానీ, డాక్టర్లు లేకపోవడం వల్ల జనాలు ఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఎంపీలనే ఆశ్రయించాల్సివస్తోంది. 

రాష్ట్రంలో సుమారు 636 పీహెచ్‌‌‌‌‌‌‌‌సీలు, మరో రెండొందల యూపీహెచ్‌‌‌‌‌‌‌‌సీలు ఉన్నాయి. ఒక్కో పీహెచ్‌‌‌‌‌‌‌‌సీలో ఒక్కో డాక్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను పని చేయించేందుకు సరిపడా కేడర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కూడా ప్రస్తుతం అందుబాటులో లేదు. వాస్తవానికి, డే అండ్ నైట్ అందుబాటులో ఉండే పీహెచ్‌‌‌‌‌‌‌‌సీలలో కనీసం ముగ్గురి నుంచి నలుగురు డాక్టర్లు ఉండాలి. డే అండ్ నైట్ నడిచే పీహెచ్‌‌‌‌‌‌‌‌సీలు సుమారు 236 ఉన్నాయి. వీటిలోనూ ఒకరిద్దరు డాక్టర్లతోనే నెట్టుకొస్తున్నారు. ఇప్పుడు ఇంకో వంద మంది పీజీ కోసం వెళ్తే పీహెచ్‌‌‌‌‌‌‌‌సీలు ఖాళీ అవక తప్పదు.

దసరా పాయే.. దీపావళి వచ్చే
పీహెచ్‌‌‌‌‌‌‌‌సీలలో డాక్టర్ల భర్తీకి సంబంధించి ఇప్పటికే మెడికల్ అండ్ హెల్త్ సర్వీసెస్ రిక్రూట్‌‌‌‌‌‌‌‌మెంట్ బోర్డు నోటిఫికేషన్ ఇచ్చింది. దసరా నాటికే ఈ రిక్రూట్‌‌‌‌‌‌‌‌మెంట్ పూర్తవుతుందని,  డాక్టర్లు ఉద్యోగాల్లోకి వస్తారని మంత్రి హరీశ్‌‌‌‌‌‌‌‌రావు ప్రకటించారు. ఇప్పటి వరకూ నియామక ప్రక్రియ పూర్తి కాలేదు. కనీసం మెరిట్ లిస్టు కూడా విడుదల చేయలేదు. ఈ ప్రక్రియ అంతా పూర్తయ్యే సరికి ఇంకో నెల రోజులైనా పట్టే అవకాశం ఉంది. తెలంగాణ వైద్య విధాన పరిషత్ పరిధిలోనూ స్పెషలిస్ట్ డాక్టర్ల కొరత విపరీతంగా ఉంది. సుమారు 4 వేల మంది డాక్టర్లు ఉండాల్సిన చోట, 2 వేల మంది కూడా అందుబాటులో లేరు. ఈ పోస్టుల భర్తీకి ఆర్థిక శాఖ ఆమోదం తెలిపినప్పటికీ, ఇప్పటివరకు కనీసం నోటిఫికేషన్ ఇవ్వకపోవడం గమనార్హం. ప్రస్తుతానికి డాక్టర్ల సర్దుబాట్లతో నెట్టుకురావడానికి టీవీవీపీ ఆఫీసర్లు ప్రయత్నిస్తున్నారు.

టీచింగ్ హాస్పిటల్స్‌‌‌‌‌‌‌‌లోనూ అదే దుస్థితి
ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లో అసిస్టెంట్ ప్రొఫెసర్ల భర్తీకి నోటిఫికేషన్ ఇస్తామని నెల రోజులుగా చెబుతున్నా, ఇప్పటి వరకూ జారీ చేయలేదు. తమ వద్ద ఖాళీలు, రోస్టర్ పాయింట్ ఫైల్ రాలేదని రిక్రూట్‌‌‌‌‌‌‌‌మెంట్ బోర్డు అధికారులు చెబుతున్నారు. కొత్త, పాత మెడికల్ కాలేజీల్లో కలిపి 1,300 ఖాళీలు ఉన్నాయి. ఈ ఏడాది రాష్ట్రంలో 7 కొత్త మెడికల్ కాలేజీలు వచ్చాయి. ఎంబీబీఎస్ కౌన్సెలింగ్ షురువైంది. నెల రోజుల్లో కాలేజీలన్నింటిలో క్లాసులు స్టార్టవుతాయి. ఇప్పటికిప్పుడు భర్తీ మొదలైనా, క్లాసులు స్టార్ట్ అయ్యే నాటికి ప్రక్రియ పూర్తయ్యే చాన్స్​ లేదు.