
సినిమాలతో బిజీబిజీగా ఉన్న బాలీవుడ్ హీరోయిన్ ప్రియాంక చోప్రా భవిష్యత్లో రాజకీయాల్లోకి వస్తానంటోంది. విద్య, ఆరోగ్యం, మహిళా హక్కులు మొదలైన సామాజిక అంశాలపై ప్రచారంలో యాక్టివ్గా పాల్గొంటున్న ఆమె.. సండే టైమ్స్ తో మాట్లాడుతూ రాజకీయాలపై తనకు ఆసక్తి ఉందని ప్రకటించింది. తన భర్త, సింగర్ నిక్ జోనాస్‌కు కూడా పొలిటికల్ ప్లాన్స్ఉన్నాయని, అతడు అమెరికా ప్రెసిడెంట్గా పోటీ చేస్తే మద్దతిస్తానని చెప్పింది. ‘‘భారత ప్రధానిగా పోటీ చేయడాన్ని నేను ఇష్టపడతాను. యూఎస్ ప్రెసిడెంట్గా నిక్ పోటీ చేసినా నాకు ఇష్టమే” అని ఆమె తెలిపింది. రాజకీ యాలకు సంబంధించిన కొన్ని విషయాలు తమకు నచ్చవని, కానీ మార్పు కోసం తామిద్దరం రాజకీ యాల్లోకి రావాలని కోరుకుంటున్నా మని చెప్పింది. తన భర్త నిక్ గొప్ప నాయకుడు అవుతాడని, ఫెమినిస్ట్ అనే పదాన్ని పలికేందుకు అతను ఏ మాత్రం సంకోచించడని, అది తనకు చాలా ఇష్టమని ప్రియాంక చెప్పింది.