సీఎం కేసీఆర్ కు చిత్తశుద్ధి లేదు

సీఎం కేసీఆర్ కు చిత్తశుద్ధి లేదు

రాష్ట్ర ప్రజల ఆరోగ్యం పట్ల సీఎం కేసీఆర్కు కనీసం చిత్తశుద్ధి లేదని ఆరోపించారు బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ. గురువారం రోజు ప్రధాని మోడీ నిర్వహించిన సీఎంల వీడియో కాన్ఫరెన్స్ లో.....కేసీఆర్ ఎందుకు పాల్గొనలేదో ప్రజలకు సమాధానం చెప్పాలని  డిమాండ్ చేశారు డీకే అరుణ. దేశ ప్రధాని ప్రజల కోసం సమయాన్ని కేటాయిస్తే, కేసీఆర్ మాత్రం చాలా బిజీగా ఉన్నారన్నారు. సీఎం కేసీఆర్ వ్యవహారశైలిని రాష్ట్ర ప్రజలు గమనిస్తున్నారన్నారు. కేసీఆర్కు తగిన బుద్ధి చెప్పేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారన్నారు డీకే అరుణ.