అంతర్జాతీయ స్థాయిలో మార్పులు .. తెలంగాణలో 50 రైల్వే స్టేషన్ లకు మహర్థశ

అంతర్జాతీయ స్థాయిలో మార్పులు ..  తెలంగాణలో 50  రైల్వే స్టేషన్ లకు మహర్థశ

మోదీ సర్కార్ రైల్వే స్టేషన్ల అభివృద్ధికి శ్రీకారం చుట్టింది. దేశవ్యాప్తంగా రైల్వే స్టేషన్లు స్మార్ట్ రైల్వే స్టేషన్‌లుగా మార్చబోతోంది.  అమృత్ భారత్ స్టేషన్ స్కీంలో భాగంగా రైల్వే స్టేషన్ల రూపు రేఖలు మారనున్నాయి. సిటీల్లో ఉండే స్టేషన్లే కాకుండా జిల్లా, మండల కేంద్రాల్లో ఉండే రైల్వే స్టేషన్లను కూడా ఈ పథకంలో ఎంపిక చేశారు. దేశంలోని 550కు పైగా రైల్వే స్టేషన్ల అభివృద్ధికి ప్రధాని మోదీ వర్చువల్ గా శంకుస్థాపన చేయనున్నారు. 

 ప్రస్తుతం ఉన్న రైల్వే స్టేషన్లను అంతర్జాతీయ స్థాయిలో మార్పులు చేయాలని కేంద్రం భావిస్తుంది. ఈ స్కీంలో భాగంగా దక్షిణ మధ్య రైల్వేలో 50 పైగా స్టేషన్లు ఎంపిక చేశారు. గద్వాల్, జడ్చర్ల, షాద్ నగర్, బేగం పేట్ , ఉందా నగర్, యాకుత్ పురా, మేడ్చల్, మెదక్, బాసర తదితర స్టేషన్లకు మహర్ధశ పట్టనుంది. ఈ నెల 26 న రైల్వే స్టేషన్ల అభివృద్ధికి ప్రధాని మోదీ వర్చువల్ గా శంకుస్థాపన  చేయనున్నారు. గత సంవత్సరం దేశ వ్యాప్తంగా 500కు పైగా స్టేషన్ల అభివృద్దికి శంకుస్థాపన చేసిన విషయం తెలిసిందే.