అన్ని పార్టీలను కలుపుకొని ముందుకెళ్తాం : ప్రధాని మోడి 

అన్ని పార్టీలను కలుపుకొని ముందుకెళ్తాం : ప్రధాని మోడి 

పార్లమెంటు శీతాకాల సమావేశాల్లో దేశ గౌరవాన్ని, అభివృద్ధిని పెంచే విధంగా చర్చ జరగుతాయని ఆశిస్తున్నట్లు ప్రధాని మోడీ చెప్పారు. దేశాన్ని అభివృద్ధి పథంలో కొత్త శిఖరాలకు ఎలా తీసుకెళ్లాలన్న అంశంపై అన్ని పార్టీలతో చర్చలు జరుపుతామని చెప్పారు. ప్రతిపక్షాలు ఇచ్చే  సలహాలు, సూచనల్ని స్వీకరిస్తామని మోడీ ప్రకటించారు. పార్లమెంట్ శీతాకాల సమావేశాల ప్రారంభానికి ముందు మోడీ మీడియాతో మాట్లాడారు.  

జీ 20 ప్రెసిడెన్సీ భారత్ కు దక్కడం గొప్ప అవకాశమని మోడీ అన్నారు. ఈ సమ్మిట్ భారత సామర్థ్యాన్ని ప్రపంచానికి పరిచయం చేసే గొప్ప అవకాశం అని చెప్పారు. ప్రపంచ దేశాల్లో భారత్ ప్రతిష్ట పెరుగుతోందని, గ్లోబల్ కమ్యూనిటీలో చోటు సంపాదించిన తీరు, భారత్‌ పట్ల ప్రపంచ దేశాలకు పెరిగిన అంచనాలు, విశ్వ వేదికగా మన దేశం తన భాగస్వామ్యాన్ని పెంచుకుంటున్న తీరు ఎంతో గొప్పగా ఉందని ప్రధాని అభిప్రాయపడ్డారు. ఇలాంటి సమయంలో, భారతదేశం జీ20  ప్రెసిడెన్సీని అందుకోవడం దేశానికి గర్వకారణం అన్నారు. జీ 20 సమ్మిట్ ద్వారా భారత ప్రజాస్వామ్యాన్ని, వైవిధ్యాన్ని, సామర్థ్యాన్ని  ప్రపంచం తెలుసుకోబోతోంది మోడీ చెప్పారు.